Anantapuram Child Death: మంత్రి ఉషశ్రీ చరణ్ ర్యాలీ: చిన్నారి మృతి ఘటనపై జిల్లా ఎస్పీ వివరణ

ఎస్పీ ఫకీరప్ప శనివారం మీడియాతో మాట్లాడుతూ మంత్రి కాన్వాయ్ కోసం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విదించినందువల్లే చిన్నారి మృతి చెందిదనడం అవాస్తవమని ఆయన అన్నారు

Anantapuram Child Death: మంత్రి ఉషశ్రీ చరణ్ ర్యాలీ: చిన్నారి మృతి ఘటనపై జిల్లా ఎస్పీ వివరణ

Anantapur

Anantapuram Child Death: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మంత్రి ఉషశ్రీ చరణ్ ర్యాలీ సమయంలో ఆపదలో ఉన్న ఓ చిన్నారి సరైన సమయానికి చికిత్స అంధక మృతి చెందింది. అయితే మంత్రి ర్యాలీ సందర్భంగా పోలీసులు అడ్డగించడంతోనే ఆసుపత్రికి చేరుకునేందుకు ఆలస్యమై తమ కూతురు మృతి చెందిందంటూ చిన్నారి తండ్రి ఆరోపిస్తూ చిన్నారి మృతదేహంతో రోడ్డుపై భైఠాయించి పోలీసుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈఘటనపై లోతుగా విచారణ జరిపిన జిల్లా పోలీసులు..పాప మృతికి, మంత్రి ర్యాలీ, పోలీసులు కారణం కాదని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప శనివారం మీడియాతో మాట్లాడుతూ చిన్నారి మృతి ఘటన వివరాలు వెల్లడించారు. మంత్రి కాన్వాయ్ కోసం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విదించినందువల్లే చిన్నారి మృతి చెందిదనడం అవాస్తవమని ఆయన అన్నారు.

Also read:Rahul Gandhi : 76వేల మంది రైతులు చనిపోతే రైతు బీమా ఇచ్చామన్నారు : రేవంత్ రెడ్డి

ఈ ఘటనపై సీసీఫుటేజ్ ఆధారాలు సేకరించిన పోలీసులు లోతుగా విచారణ చేసి వాస్తవాలు బయటపెట్టేందుకు ప్రయత్నించారని ఎస్పీ పేర్కొన్నారు. ఎస్పీ తెలిపిన వివరాలు మేరకు “చిన్నారిని తీసుకుని తలిదండ్రులు శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామం నుండీ సాయంత్రం 6:10 గంటలకు బయల్దేరారు..చిన్నారి, తల్లి బైకులో వెళ్తున్నట్లు మంత్రి గారి ఇంటి సమీపంలోని బ్రహ్మయ్య గుడి పోలీసు చెక్ పోస్టు వద్ద 6:36 pm గంటలకు సిసి ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది. కళ్యాణదుర్గం టౌన్ లోకి వారు చిన్నారి సహా ఎంటర్ అయిన టైం 6:40 pm, కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రికి ఎంట్రెన్ అయిన టైం 6:48 pm, ఆర్డీటీ ఓ.పి విభాగంలో నమోదు చేసిన సమయం 6:50 pm, ఆర్డీటీ ఆసుపత్రిలో చిన్నారి చనిపోయిన సమయం 7:18 pm, చెర్లోపల్లి నుండీ ఆర్డీటీ ఆసుపత్రికి వీరికి పట్టిన సమయం 38 నిముషాలు ( మధ్య దూరం 20 kms).

Also read:Mother Son Suicide Case : తల్లీ కొడుకు ఆత్మహత్య.. న్యాయం జరిగేలా చూస్తామన్న ఎస్పీ.. అజ్ఞాతంలో సీఐ

చిన్నారి మృత దేహంతో రోడ్డుపై బాదితులు ఆందోళనకు దిగిన సమయం 8:15 pm” అంటూ ఎస్పీ ఫకీరప్ప సీసీటీవీ ఫుటేజీలలో నమోదైన సమయాన్ని మీడియాకు వెల్లడించారు. పాపకు వైద్యం అవసరమని గ్రహించిన పోలీస్ సిబ్బంది..మంత్రి ర్యాలీతో సంబంధం లేకుండానే బాధితులను ఆసుపత్రికి పంపినట్లు పోలీసులు తెలిపారు. వాస్తవాలు వక్రీకరించి లేనిపోని రాద్ధాంతం చేయవద్దని, పోలీసులపై బురద జల్లడమే కాకుండా శాంతిభద్రతల సమస్యకు కారణామయితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ ఫకీరప్ప హెచ్చరించారు.

Also read:Andra Pradesh : మంత్రివర్గ విస్తరణ తర్వాత..నెల్లూరు వైసీపీలో పెను మార్పులు..ఏ పరిణామాలకు దారితీయనున్నాయ్?