Andhra Pradesh : 24 గంటల్లో 2, 527 కేసులు, 19 మంది మృతి

Andhra Pradesh : 24 గంటల్లో 2, 527 కేసులు, 19 మంది మృతి

Ap Corona

AP Fresh Coronavirus : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు మెల్లిమెల్లిగా తగ్గిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 2 వేల 527 మందికి కరోనా సోకింది. 19 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 23 వేల 939 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 13 వేల 197 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున కరోనాతో చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 515 కరోనా కేసులు నమోదయ్యాయి.

Read More : Melbourne Couple Jail : భారతీయ మహిళను 8 ఏళ్లుగా హింసించారు.. చివరికి జైలుపాలయ్యారు!

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :-

చిత్తూరులో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, తూర్పు గోదావరిలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, వైఎస్ఆర్ కడపలో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్కరు, విశాఖలో ఒక్కరు మరణించారు.

Read More : Heavy Rain : విషాదం.. గోడకూలి ఏడుగురు మృతి

జిల్లాల వారీగా కేసులు :
అనంతపురం 69. చిత్తూరు 318. ఈస్ట్ గోదావరి 515. గుంటూరు 182. వైఎస్ఆర్ కడప 111. కృష్ణా 249. కర్నూలు 61. నెల్లూరు 206. ప్రకాశం 303. శ్రీకాకుళం 49. విశాఖపట్టణం 133. విజయనగరం 43. వెస్ట్ గోదావరి 288. మొత్తం : 2,527