AP PRC Fight : తగ్గేదే లే అంటున్న ఉద్యోగులు.. సమ్మె సైరన్

కొత్త పీఆర్సీ వల్ల రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఉద్యోగికి నష్టం జరుగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు...ఉమ్మడి పోరాటంతో మెరుగైన పీఆర్సీ సాధించుకుంటామని దీమా వ్యక్తం చేశారు..

AP PRC Fight : తగ్గేదే లే అంటున్న ఉద్యోగులు.. సమ్మె సైరన్

AP PRC

Andhra Pradesh Employees : పీఆర్సీపై ఏపీ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలని ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. పీఆర్సీ జీవోలను కేబినెట్ ఆమోదించడంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కన్నెర్ర చేశాయి. ఇక సమ్మెలోకి వెళ్లాలని లెటెస్ట్ గా నిర్ణయం తీసుకున్నాయి. 2022, జనవరి 21వ తేదీ శుక్రవారం కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ (PRC GO)లను మంత్రిమండలి ఆమోదించడంతో ఉద్యోగ సంఘాలు నిర్ణయం ప్రకటించాయి.

Read More : AP Cabinet : ఉద్యోగుల పీఆర్సీ జీవోలకు ఆమోదం..రిటైర్‌‌మెంట్ 62 ఏళ్లకు పెంపు

శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలువనున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఆయనకు సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించాయి. ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. జనవరి 25 వ తేదీన కలెక్టరేట్ల ముట్టడి చేయనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన చలో విజయవాడ పేరిట ఓ కార్యక్రమం నిర్వహించనున్నారు. అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటైన ఐక్యకార్యాచరణ సమితి సమావేశం విజయవాడలో జరుగుతోంది. సీఎస్ కు శుక్రవారం నోటీస్ ఇస్తే ఫిబ్రవరి 7 నుంచి సమ్మెలోకి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లనున్నారు. మరి వీరి సమ్మెలోకి వెళ్లకుండా ప్రభుత్వం ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా ? అనేది వేచి చూడాలి.

Read More : Shanmukh Jaswanth : షణ్ముఖ్ జస్వంత్ నుంచి మరో సిరీస్.. బిగ్‌బాస్ నుంచి వచ్చాక ఫస్ట్ ప్రాజెక్టు

కొత్త పీఆర్సీ వల్ల రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఉద్యోగికి నష్టం జరుగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలుగా మనస్పర్థలు ఉన్నప్పటికీ అన్నీ పక్కన పెట్టి మెరుగైన పీఆర్సీ సాధించాలనే లక్ష్యంతో కలిసి పనిచేస్తామని నేతలు ప్రకటించారు. అన్ని సంఘాలు కలిస్తేనే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని సచివాలయ జేఏసీ నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఉమ్మడి పోరాటంతో మెరుగైన పీఆర్సీ సాధించుకుంటామని దీమా వ్యక్తం చేశారు.