AP Curfew Timings : ఏపీలో రాత్రి గం.10 నుంచి ఉదయం గం. 6 వరకు కర్ఫ్యూ

ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ వేళలను సవరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి గం.10 లనుంచి ఉదయం గం.6 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.

AP Curfew Timings : ఏపీలో రాత్రి గం.10 నుంచి ఉదయం గం. 6 వరకు కర్ఫ్యూ

Ap Curfew Timings Changed

AP Curfew Timings : ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ వేళలను సవరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి గం.10 లనుంచి ఉదయం గం.6 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. కోవిడ్ నియంత్రణ పై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్‌ నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

మాస్క్‌ ధరించకపోతే రూ.100ల జరిమానా కచ్చితంగా వేయాలని… దుకాణాల్లో కూడా సిబ్బంది దగ్గరనుంచి వినియోగదారులకు వరకూ మాస్క్‌లు ధరించాల్సిందేనని ఆదేశించారు. ఉల్లంఘనలకు పాల్పడితే దుకాణాలకు భారీ జరిమానాలువిధించాలని ఆయన అన్నారు. అవసరమైతే 2–3 రోజులు దుకాణాలు మూసివేతకు ఆదేశాలు ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి సూచించారు.

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎవరైనా ఫొటో తీసి పంపినా జరిమానాలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వాట్సాప్‌ నంబర్‌ ను రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలియచేయాలని నిర్ణయించారు. ఏపీలో 144 సెక్షన్‌ కుడా కఠినంగా అమలు జరిగేలా చూడాలని ప్రజలెవ్వరూ గుమిగూడకుండా కఠినంగా ఆంక్షలు అమలు చేయాలని సీఎం అధికాలకు చెప్పారు.

మార్కెట్లు, తదితర చోట్ల కూడా మాస్క్‌లు ధరించాలంటూ ఆదేశాలు  మార్కెట్‌కమిటీలు మాస్క్‌లు ధరించేలా చూడాలంటూ ఆదేశాలు జారీ చేయాలని సీఎం అన్నారు. అన్నిజిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ ఉండేలా వేళలు సవరించారు. ఉదయం 6 గంటలనుంచి రాత్రి 9 గంటలవరకూ సడలింపు ఇచ్చారు. రాత్రి 9 గంటలకల్లా దుకాణాల మూసివేసి, 10 గంటల కల్లా అందరు ఇళ్లకు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించారు. రాత్రి 10 గంటలనుంచి ఉదయం 6 గంటలవరకూ కర్ఫ్యూ అమలు చేస్తారు.