Jagan Sanctions Rs 1 Crore: చిన్నారి హనీకి ఇంజెక్షన్ల కోసం రూ.కోటి మంజూరు చేయించిన సీఎం జగన్

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ పాపకి ఇంజెక్షన్ల కోసం ఆంధ్రప్రదేశ్ బజ్జెట్ నుంచి కోటి రూపాయలు మంజూరు చేశారు. అల్లవరం మండలం నక్కా రమేశ్వరానికి చెందిన కొప్పాడి రాంబాబు నాగలక్ష్మి దంపతుల కుమార్తె హనీ (రెండున్నరేళ్ల వయసు) జన్మించినప్పటి నుంచి గాకర్స్ వ్యాధితో బాధపడుతోంది. ఇటీవల కోనసీమ వరద ప్రాంతాలను పర్యటించడానికి వెళ్లిన సీఎం జగన్ కాన్వాయ్ వద్ద హనీ తల్లిదండ్రులు ప్లకార్డు ప్రదర్శించారు.

Jagan Sanctions Rs 1 Crore: చిన్నారి హనీకి ఇంజెక్షన్ల కోసం రూ.కోటి మంజూరు చేయించిన సీఎం జగన్

Jagan Sanctions Rs 1 Crore: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ పాపకి ఇంజెక్షన్ల కోసం ఆంధ్రప్రదేశ్ బజ్జెట్ నుంచి కోటి రూపాయలు మంజూరు చేశారు. అల్లవరం మండలం నక్కా రమేశ్వరానికి చెందిన కొప్పాడి రాంబాబు నాగలక్ష్మి దంపతుల కుమార్తె హనీ (రెండున్నరేళ్ల వయసు) జన్మించినప్పటి నుంచి గాకర్స్ వ్యాధితో బాధపడుతోంది. ఇటీవల కోనసీమ వరద ప్రాంతాలను పర్యటించడానికి వెళ్లిన సీఎం జగన్ కాన్వాయ్ వద్ద హనీ తల్లిదండ్రులు ప్లకార్డు ప్రదర్శించారు.

దీంతో కాన్వాయ్ ను ఆపిన సీఎం జగన్ పాప గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఇంజెక్షన్ అమెరికాలో తయారీ అవుతుందని వైద్యులు తమకు చెప్పినట్లు తల్లిదండ్రులు వివరించారు. ఒక్కో ఇంజెక్షన్ విలువ లక్షా 25 వేల రూపాయలని చెప్పారు. గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హనీకి 15 రోజులకు ఒక ఇంజెక్షన్ వాడాలి. ఈ ఇంజెక్షన్ ను అమెరికా నుంచి రాయితీతో 74 వేలకు రాష్ట్ర ప్రభుత్వం కొనగోలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 52 ఇంజెక్షన్లను మంజూరు చేయగా, ప్రస్తుతం పాప తల్లిదండ్రులకు 13 ఇంజెక్షన్లు జిల్లా కలెక్టర్ శుక్లా అందించారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..