Anitha Vangalapudi : దారుణంగా పోస్టులు పెడుతున్నారు, మిమ్మల్ని ఏడిపించే రోజు మాకు త్వరలోనే వస్తుంది- వంగలపూడి అనిత వార్నింగ్

Anitha Vangalapudi : ఒక ఆడబిడ్డ మీద ఈ రాతలు ఎలా రాస్తారు? నోటికి వచ్చినట్లు దారుణ పదజాలం వినియోగిస్తున్నారు.

Anitha Vangalapudi : దారుణంగా పోస్టులు పెడుతున్నారు, మిమ్మల్ని ఏడిపించే రోజు మాకు త్వరలోనే వస్తుంది- వంగలపూడి అనిత వార్నింగ్

Anitha Vangalapudi(Photo : Twitter)

Updated On : July 16, 2023 / 6:40 PM IST

Anitha Vangalapudi – YSRCP : తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తన ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మిమ్మల్ని ఏడిపించే రోజు త్వరలోనే మాకూ వస్తుందని ఆమె హెచ్చరించారు. నేను అడుగుతున్న ప్రశ్నలకు వైసీపీ నేతలు సమాధానాలు చెప్పడం లేదన్నారామె. టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన మహిళలను కించపరిచేలా వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారని వాపోయారు.

”మద్యపాన నిషేధం ఎప్పుడు చేస్తారు? అని చెప్పమంటే చెప్పలేరు. పైగా స్త్రీ జాతి వినలేని మాటలు మాట్లాడుతున్నారు. నాపై అత్యంత హేయమైన వ్యాసాలు రాసి భాద పెడుతున్నారు. నోటికి వచ్చినట్లు దారుణ పదజాలం వినియోగిస్తున్నారు. నాపై అనేక జుగుప్సకరమైన రాతలు రాయిస్తోంది భారతి. స్వయంగా సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి సొషల్ మీడియాలో రాతలు రాయిస్తున్నారు.

Also Read..Pilli Subhash Chandra Bose: పిల్లి సుభాశ్‌చంద్రబోస్ వైఖరిలో మార్పు ఎందుకొచ్చింది.. అసంతృప్తిగా ఉన్నారా?

ఒక ఆడబిడ్డ మీద ఈ రాతలు ఎలా రాస్తారు? నేను ఈ విషయాల మీద ఫిర్యాదు చేసేందుకు డీజీపీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. సీఎంను ప్రశ్నించడమే నేను చేసిన తప్పా? నేను ఎంతో బాధపడ్డాను. కానీ, ఎడవను. ఈ పోస్టులు పెట్టిన వారిని ఏడిపించే రోజు వస్తుంది మాకు. చదువుకున్న దళిత ఆడబిడ్డను నేను. నాకు అండగా నిలిచింది చంద్రబాబు. నన్ను విమర్శించారు కదా అని ఇంట్లో కూర్చునే మనిషిని కాను నేను. పోరాడతాను, నిలబడతాను, పోలీసు యంత్రాంగం నాకు సహకరించాలి.

డీజీపీ సుమోటోగా విచారణ చేయాలి. న్యాయస్థానాల పరంగా సుమోటోగా తీసుకుని విచారణ చేయాలి. ఈ నాలుగేళ్ల వైసీపీ పాలనలో 4వేల హత్యాచారాలు జరిగాయి. ఒక్క ఫిర్యాదు ఇస్తాను అంటే కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు మన రాష్ట్ర డీజీపీ. సొంత చెల్లి మీదే అవాకులు మాట్లాడారు. కనీసం చిన్న పిల్లలున్న సభలో ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తి సీఎంగా ఉంటే ఇలాగే ఉంటుంది” అని వంగలపూడి అనిత మండిపడ్డారు.

Also Read..YCP: వైసీపీలో వారసుల సందడి.. తలలు పట్టుకుంటున్న వైసీపీ పెద్దలు..!