AP Assembly : 26 కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం.. నిరవధిక వాయిదా

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. 26 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 34 గంటల 50 నిమిషాల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ అసెంబ్లీ సెషన్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

AP Assembly : 26 కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం.. నిరవధిక వాయిదా

Ap Assembly

AP Assembly adjourned : ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. 26 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 34 గంటల 50 నిమిషాల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ అసెంబ్లీ సెషన్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం అయితేనే అసెంబ్లీకి వస్తానంటూ టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు శపథం చేశారు.

అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాలను రద్దు చేస్తూ గతంలో చేసిన చట్టాలను వెనక్కి తీసుకుంటూ ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదo తెలిపింది. శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ మరో తీర్మానం చేసింది. 2021 జనాభా లెక్కల్లో బీసీ కులగణన చేపట్టాలని అసెంబ్లీ తీర్మానించింది.

CAG Report : రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఏపీ ఆర్థిక వ్యవహారాలు : కాగ్

సినిమాటోగ్రఫీ చట్టంలో కీలక మార్పులు చేస్తూ అసెంబ్లీ చట్ట సవరణ చేసింది. ఇకపై ఆన్‌లైన్‌లోనే సినిమా టికెట్ల అమ్మకాలు జరుగున్నాయి. ఏపీఎఫ్డీసీ ఆన్ లైన్ పోర్టల్ ని నిర్వహించనుంది.