Viral Video:‘నా పెన్సిల్ దొంగిలించాడు..ఈడి మీద కేసు పెట్టండి సార్..’ పోలీసులకు బుడ్డోడు ఫిర్యాదు..

‘నా పెన్సిల్ దొంగిలించాడు సార్..ఈడిమీద కేసు పెట్టటండి సార్..’ అంటూ ఓ పిల్లాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు విన్న పోలీసులు ఏం చేశారంటే..

10TV Telugu News

boy complains police about pencil theft : పోలీసు స్టేషన్ కు ఎన్నో ఫిర్యాదులు వస్తుంటాయి. అలాగే ఏపీలోని కర్నూలు జిల్లా పెదకడబూరు పోలీసు స్టేషన్ కూడా ఓ పెద్ద పంచాయితీ వచ్చింది. ఆ ఫిర్యాదు విన్న పోలీసులు ఒకరి ముఖాలు మరొకరు చూసుకుని నవ్వుకున్నారు. అదేమంటే..ఓ స్కూల్ పిల్లాడు..‘సార్ సార్..నా పెన్సిల్ పోయింది సార్..ఈడే దొగించాడు..ఈడిమీద కేసు పెట్టండీ సార్’ అంటూ బిక్కమొహం వేసుకుని చెప్పాడు.అది విన్న పోలీసులు నవ్వుకున్నారు.

Read more : Rooster Death : నా కోడిని చంపేసారు.. పోస్ట్ మార్టం చేయండి.. మాజీ ఎమ్మెల్యే కొడుకు డిమాండ్

ఈ పెద్ద పంచాయితీ వివరాలేమంటే..6 ఏళ్ల హ‌న్మంత్ అనే విద్యార్థి పెన్సిల్‌ను మ‌రో అబ్బాయి దొంగిలించాడు. దీంతో హ‌న్మంత్ స్థానిక పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి ‘సార్ నా పెన్సిల్ దొంగ‌త‌నం జరిగింది సార్..ఆడే నా పెన్సిల్ కొట్టేశాడు…ఈడిమీద కేసు రాయండీ సార్’..ఇలా ఒకరోజే కాదు నాప్ర‌తి రోజు పెన్సిల్స్ దొంగ‌త‌నం చేస్తున్నాడు. నా డబ్బులు కూడా తీసుకుపోతున్నాడు. రోజు ఇదే ప‌ని..ఈడిమీద కేసు రాసి..నా పెన్సిల్ డబ్బులు నాకిప్పించండీ సార్’అంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

Read more :Road Stolen: మా ఊర్లో కిలోమీటరు రోడ్డు మాయం అయిపోయింది సార్..వెతికిపెట్టిండీ..పోలీసులకు ఫిర్యాదు

దానికి పక్కనున్న పిల్లాడు మాట్లాడుతు..అదేనండీ ఎవరైతే పెన్సిల్ దొంగిలించాడని చెబుతున్నాడో ఆ పిల్లాడు ‘సార్ ఆడి పెన్సిల్ తీసుకున్న మాట నిజమే..కానీ పెన్సిల్ తిరిగి ఇచ్చేసాను..అని సంజాయిషీ ఇచ్చుకున్నాడు బిక్క మొహం వేసుకుని..కానీ హ‌న్మంత్ ఏ మాత్రం విన‌లేదు. నాకు న్యాయం చేస్తారా లేదా? అతనిపై కేసు పెడతారా లేదా? అంటూ ఓ పదినిమిషాలు పోలీస్ స్టేషన్‌ లో కాసేపు సరదా నవ్వులు పూయించాడు. ‘ఈ ఒక్కసారికి ఆడిమీద కేసు పెట్టండి సార్..తిక్క కుదురుద్ది వీడికి’.. అంటూ అని పోలీసుల‌ను అడిగాడు.

Read more : నా చెట్టు పోయింది సార్..పోలీసులకు 6th క్లాస్ పిల్లాడి ఫిర్యాదు..

వాళ్ల ముద్దు ముద్దు మాటలు విన్న పోలీసులు నవ్వుకుని నచ్చచెప్పి పంపించేశారు. మీరు పిల్లలురా..చక్కగా కలిసి బాగా చదువుకోండిరా..కలిసి మెలిసి ఆడుకోండీ అంటూ చక్కగా చెప్పి పంపించేశారు. హ‌న్మంత్ తీరు..వాడి ఫిర్యాదు చేసిన తీరు తలచుకుని పోలీసులు స‌ర‌దాగా న‌వ్వుకున్నారు.ఈ ఫన్నీ ఘటన చూడటానికి ఫన్నీగా అనిపించినా.. అంత చిన్న వయసులో న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లాలన్న ఆలోచన ఆ చిన్నారికి రావడం బాగుందంటున్నారు నెటిజన్లు…