CM Jagan : నాసి రకం విత్తనాలు, ఎరువులు అమ్మితే రెండేళ్లు జైలు శిక్ష..!

వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం జగన్ అన్నారు. ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. వ్యవసాయ శాఖ, ధాన్యం సేకరణపై సమీక్షించారు.

CM Jagan : నాసి రకం విత్తనాలు, ఎరువులు అమ్మితే రెండేళ్లు జైలు శిక్ష..!

Jagan

AP CM Jagan review  : వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం జగన్ అన్నారు. ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. సోమవారం (డిసెంబర్6, 2021) తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ, ధాన్యం సేకరణపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వరి పండిస్తే వచ్చే ఆదాయం.. మిల్లెట్స్ పండిస్తే కూడా వచ్చేలా చూడాలన్నారు. దీని కోసం రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు.

మిల్లెట్స్ బోర్డును ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మిల్లెట్స్ ను సాగు చేస్తున్న ప్రాంతాల్లో ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. సేంద్రీయ, ప్రకృతి సేద్యంపై రైతుల్లో అవగాహన పెంచాలన్నారు. రైతులకు నాసీ రకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, అమ్మితే రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Palle Velugu Buses : ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..పల్లె వెలుగు బస్సుల రంగు మార్పు

పశువులకు ఆర్గానిక్ ఫీడ్ కూడా అందుబాటులో ఉండాలన్నారు. జిల్లాకు ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సేంద్రీయ, ప్రకృతి సేద్యంపై రైతుల్లో అవగాహన పెంచాలన్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులు స్థానంలో ప్రత్యామ్నాయంగా సేంద్రీయ పద్ధతుల ద్వారా పంట సాగును ప్రోత్సహించాలన్నారు. రసాయనాలు లేని సాగుమీద మంచి విధానాలను తీసుకురావాలన్నారు.

ఆర్బీకే యూనిట్ గా ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఆర్బీకే పరిధిలో ఏర్పాటు చేస్తున్న సీహెచ్ సీలో కూడా ఆర్గానిక్ వ్యవసాయానికి అవసరమైన పరికరాలను ఉంచాలని సూచించారు. సేంద్రీయ వ్యవసాయానికి అవసరమైన పరికరాలు, మందులు, సేంద్రీయ ఎరువుల తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలని పేర్కొన్నారు.