Palle Velugu Buses : ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..పల్లె వెలుగు బస్సుల రంగు మార్పు

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సుల రంగులు మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం సోమవారం (డిసెంబర్6, 2021) ఆదేశాలు జారీ చేసింది.

Palle Velugu Buses : ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..పల్లె వెలుగు బస్సుల రంగు మార్పు

Apsrtc

Color change of palle velugu buses : ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సుల రంగులు మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం సోమవారం (డిసెంబర్6, 2021) ఆదేశాలు జారీ చేసింది. అన్ని జిల్లాల్లోని పల్లె వెలుగు బస్సుల రంగులను మార్చాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం పల్లె వెలుగు బస్సులకు ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నలుపు రంగులు ఉన్నాయి. వీటిలో పసుపు రంగును మాత్రం తొలగించనున్నారు. పసుపు రంగుకు బదులు గచ్చకాయ రంగును వినియోగించనున్నారు. అదేవిధంగా డిజైన్ ను కూడా మార్చనున్నారు. మొదటగా రాజమహేంద్రవరంలోని ఆర్టీసీ బస్సుల రంగు మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Road Accident : మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ దంపతుల ప్రాణాలు తీశాడు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులన్నీ దాదాపు ఒకే రంగులో ఉంటాయి. ఆ రంగులు, బస్సు పేర్లను ఇప్పటికీ రెండు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు ఎలాంటి మార్పులు చేయలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో గ్రామాల్లో నడిచే బస్సులకు పల్లెవెలుగు అని పేరు పెట్టారు. ఇప్పటికీ ఆ పేరుతోనే రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి.

అయితే తాజాగా ఏపీలోని జగన్ ప్రభుత్వం పల్లె వెలుగు బస్సుల రంగును మర్చాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం అధికారులు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల్లోని అన్ని పల్లె వెలుగు బస్సుల రంగులు మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.