AP CM Jagan : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. ఏపీకి సంబంధించి కేంద్రానికి పలు విజ్ఞాపనలు

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. 2 లక్షల కోట్లతో కూడిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన విజ్ఞాపనలతో జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగింది. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు విజ్ఞాపనలను కేంద్రానికి అందజేశారు.

AP CM Jagan : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. ఏపీకి సంబంధించి కేంద్రానికి పలు విజ్ఞాపనలు

CM Jagan

AP CM Jagan : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. 2 లక్షల కోట్లతో కూడిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన విజ్ఞాపనలతో జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగింది. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు విజ్ఞాపనలను కేంద్రానికి అందజేశారు. రాష్ట్రానికి ఆర్ధిక సహకారం, పెండింగ్ నిధుల విడుదలపై అమిత్ షా, నిర్మలా సీతారామన్ కి జగన్ విజ్ఞాపనలు అందజేశారు. రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తున్నా రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయని జగన్ కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.

2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద ఏపీకి రావాల్సిన రూ.36,625 కోట్లు వెంటనే విడుదలయ్యేలా చూడాలని కోరారు. 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లు తగ్గించారని పేర్కొన్నారు. ఏపీ రుణ పరిమితి విషయంలో ఉన్న ఆంక్షలు సడలించాలన్నారు. పోలవరం ప్రాజెక్టును మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వరదల కారణంగా దెబ్బతిన్న డయాఫ్రంవాల్‌ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.202౦ కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని డీడీఆర్‌ఎంపీ అంచనా వేసింది.

Jagan-Amit Shah Meeting : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ.. పోలవరం ప్రాజెక్టుతోపాటు ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చ

ఈ డబ్బును వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పొలవరం కోసం ఖర్చు చేసిన రూ.2600.74 కోట్ల వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ. 55,548 కోట్లకు ఆమోదం తెలపాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని కోరారు. డీబీటీ పద్ధతిలో ముంపు బాధితులకు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు, 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకూ సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉందని, వీటిని వెంటనే తెలంగాణ నుంచి ఇప్పించాలని కోరారు.

జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత పాటించకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోయారు. పీఎంజీకేఏవై కార్యక్రమం కిందికి రాని రూ.56లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్‌ ఇవ్వడం వల్ల దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోందన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ చేసిన విజ్ఞప్తి సరైనదేనని నీతి ఆయోగ్‌ కూడా నిర్ణయించిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

CM Jagan : రాజధానిపై సీఎం జగన్ క్లారిటీ.. జూలై నుంచి విశాఖ నుంచే పాలన

కేంద్రం ప్రభుత్వం నెలకు వినియోగించని రేషన్ దాదాపు 3లక్షల టన్నులు ఉంటుందని ఇందులో 77వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే సరిపోతుందని చెప్పారు. రాష్ట్రానికి ఆర్ధికంగా మేలు జరిగేలా ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. సీఎం జగన్ ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరారు.