CM Jagan : రాజధానిపై సీఎం జగన్ క్లారిటీ.. జూలై నుంచి విశాఖ నుంచే పాలన

ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం జగన్.. రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. జూలై నుంచి విశాఖ నుంచే పరిపాలన ఉంటుందన్నారు సీఎం జగన్. జూలైలో విశాఖకు వెళ్తామని మంత్రులతో చెప్పారు సీఎం జగన్.

CM Jagan : రాజధానిపై సీఎం జగన్ క్లారిటీ.. జూలై నుంచి విశాఖ నుంచే పాలన

CM Jagan : ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం జగన్.. రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. జూలై నుంచి విశాఖ నుంచే పరిపాలన ఉంటుందన్నారు సీఎం జగన్. జూలైలో విశాఖకు వెళ్తామని మంత్రులతో చెప్పారు సీఎం జగన్.

త్వరలోనే వైజాగ్ నుంచి పరిపాలన స్టార్ట్ అవుతుందని, తాను కూడా వైజాగ్ కు షిఫ్ట్ అవుతానని సీఎం జగన్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఏప్రిల్ నుంచి అక్కడ పాలన మొదలవుతుందని అంతా అనుకున్నారు. ఆ విధంగా వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో.. జూలైలో విశాఖకు షిఫ్ట్ అవుతానని సీఎం జగన్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు.

Also Read..Visakhapatnam Executive Capital : త్వరలో విశాఖ పరిపాలనా రాజధాని కాబోతోంది, నేను కూడా షిఫ్ట్ కాబోతున్నా-సీఎం జగన్ కీలక ప్రకటన

జగన్ అధ్యక్షతన మంగళవారం క్యాబినెట్ సమావేశం జరిగింది. అనంతరం మంత్రులతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జూలైలో విశాఖకు తరలివెళుతున్నామని తెలిపారు. విశాఖ నుంచే పాలన ఉంటుందని వెల్లడించారు.

విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని, ఏపీ రాజధాని విశాఖేనని ఢిల్లీలోనూ, ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులోనూ సీఎం జగన్ ప్రకటించడం తెలిసిందే. విపక్షాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ సీఎం జగన్ తమ ప్రకటనకు కట్టుబడి ఉన్నట్టు తాజాగా క్యాబినెట్ భేటీలో చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది.

Also Read..Minister Buggana Rajendranath : త్వరలోనే వైజాగ్ నుంచి పరిపాలన : మంత్రి బుగ్గన

కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షం విమర్శలను తిప్పికొట్టాలన్నారు సీఎం జగన్. జూలైలో విశాఖకు వెళ్తున్నామని, వైజాగ్ నుంచి పరిపాలన ఉంటుందని మంత్రులకు చెప్పారు ముఖ్యమంత్రి.

ఏడు స్థానాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు వైసీపీ గెలవాలన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత మంత్రులదే అన్నారు సీఎం జగన్. పనితీరు బాగోలేకపోతే మంత్రివర్గంలో మార్పులు తప్పవని ముఖ్యమంత్రి జగన్ హెచ్చరించారు. ”ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు అన్నీ వైసీపీనే గెలవాలి. మీ పనితీరును గమనిస్తున్నా. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా మన వాళ్లను గెలిపించాల్సిన బాధ్యత మీదే” అంటూ మంత్రివర్గ సహచరులను ఉద్దేశించి జగన్ చెప్పారు.