Visakhapatnam Executive Capital : త్వరలో విశాఖ పరిపాలనా రాజధాని కాబోతోంది, నేను కూడా షిఫ్ట్ కాబోతున్నా-సీఎం జగన్ కీలక ప్రకటన

విశాఖ పరిపాలనా రాజధానిపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖ పరిపాలనా రాజధాని కాబోతోందని ఆయన చెప్పారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఈ మేరకు కీలక ప్రకటన చేశారు సీఎం జగన్.

Visakhapatnam Executive Capital : త్వరలో విశాఖ పరిపాలనా రాజధాని కాబోతోంది, నేను కూడా షిఫ్ట్ కాబోతున్నా-సీఎం జగన్ కీలక ప్రకటన

Visakhapatnam Executive Capital : విశాఖ పరిపాలనా రాజధానిపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖ పరిపాలనా రాజధాని కాబోతోందని ఆయన చెప్పారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఈ మేరకు కీలక ప్రకటన చేశారు సీఎం జగన్. అంతేకాదు త్వరలోనే తాను కూడా విశాఖకు షిఫ్ట్ కానున్నట్లు తెలిపారు.

Also Read..Andhra Pradesh: రాజధాని కేసుల ముందస్తు విచారణ కోరిన ఏపీ.. నిరాకరించిన సుప్రీం కోర్టు

విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటిల్ త్వరలోనే సాకారం కాబోతుందని, ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తామని జగన్ చెప్పారు. త్వరలోనే విశాఖ నుంచే పరిపాలన స్టార్ట్ అవుతుందన్నారు సీఎం జగన్. ముఖ్యమైన జీ-20 సదస్సుకు విశాఖ వేదికగా నిలిచిందని సీఎం జగన్ గుర్తు చేశారు.

ఓవైపు ఏపీ రాజధానికి సంబంధించి పోరాటాలు నడుస్తున్నాయి. ఏపీ రాజధాని అమరావతే అని ఆ ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు ఏపీ రాజధాని అంశంపై కోర్టులో వాదోప వాదనలు జరుగుతున్నాయి. తీర్పు వెలువడాల్సి ఉంది. ఇంతలోనే సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు.

Also Read..Minister Buggana Rajendranath : త్వరలోనే వైజాగ్ నుంచి పరిపాలన : మంత్రి బుగ్గన

త్వరలోనే విశాఖ పరిపాలనా రాజధాని కాబోతోందని ఆయన స్వయంగా ప్రకటించారు. సీఎం జగన్ చేసిన ఈ ప్రకటన ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచింది. సీఎం జగన్ నిర్ణయంపై ప్రతిపక్షాలు ఏ విధంగా రియాక్ట్ అవుతాయో చూడాలి. ఇది ఇలా ఉంటే.. కోర్టు నిర్ణయం తర్వాత సీఎం జగన్ ఏం చెబుతారు? ఏం తేలుస్తారు? ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది సస్పెన్స్ గా మారింది.