Jagan-Babu : చంద్రబాబుకు కరోనాపై సీఎం జగన్ ట్వీట్

ట్వీట్ లో.. చంద్రబాబు ట్విట్టర్ హ్యాండిల్ ను ట్యాగ్ చేశారు జగన్.

Jagan-Babu : చంద్రబాబుకు కరోనాపై సీఎం జగన్ ట్వీట్

Chandrababu Ys Jagan

Updated On : January 18, 2022 / 12:09 PM IST

Jagan-Babu : ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కరోనా పాజిటివ్ పై.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ట్విట్టర్ లో స్పందించిన వైఎస్ జగన్.. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కరోనా నుంచి చంద్రబాబు వేగంగా రికవరీ కావాలని.. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు వైఎస్ జగన్ తన అకౌంట్ లో తెలిపారు. ట్వీట్ లో.. చంద్రబాబు ట్విట్టర్ హ్యాండిల్ ను ట్యాగ్ చేశారు జగన్.

మంగళవారం జనవరి 18, 2022నాడు చంద్రబాబు నాయుడుకి కరోనా సోకింది. ఆయన కొడుకు నారా లోకేశ్ కు ఒకరోజు ముందు.. సోమవారం నాడు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో.. లోకేశ్ ఐసోలేట్ అయ్యారు. ఆ మర్నాడు చంద్రబాబుకు కూడా స్వల్పంగా జలుబు కావడంతో.. టెస్ట్ చేయించుకున్నారు. పరీక్షల్లో పాజిటివ్ రావడంతో.. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన ఇంట్లో క్వారంటైన్ అయ్యారు చంద్రబాబు.

Read This : Chandrababu: మాజీ సీఎం చంద్రబాబుకు కొవిడ్ పాజిటివ్

తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని చంద్రబాబు ట్విట్టర్ లో పంచుకున్నారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని.. జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పారు. తనను కలిసినవాళ్లు పరీక్షలు చేయించుకోవాలని బాబు కోరారు.

చంద్రబాబు బాగుండాలంటూ జగన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. రాజకీయ వైరుధ్యాలున్నా మంచి మనసు చాటుకున్నారంటూ జగన్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు.. ఏపీలో పదుల సంఖ్యలో రాజకీయ నేతలు కరోనా బారిన పడటంతో అందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు వారి అభిమానులు.

Read This : Devineni Uma: మాజీ మంత్రి దేవినేని ఉమాకు కరోనా పాజిటివ్