AP CM Jagan: ఛాలెంజ్ అంటే ఫేక్ సెల్ఫీ పిక్ కాదు.. అలాచేసే దమ్ముందా? అంటూ చంద్రబాబుకు జగన్ ఛాలెంజ్ ..

ఏపీలో ఏ కుటుంబాన్ని తీసుకున్నా, ఏ గ్రామాన్ని తీసుకున్నా, ఏ జిల్లాను తీసుకున్నా గత ప్రభుత్వంలో ఇంటింటికీ జరిగిన మంచి ఎంత? ఈ ప్రభుత్వం హయాంలో జరిగిన మంచి ఎంత? బేరీజు వేసుకోగల సత్తా చంద్రబాబుకు ఉందా అని ఏపీ సీఎం జగన్ అన్నారు.

AP CM Jagan: ఛాలెంజ్ అంటే ఫేక్ సెల్ఫీ పిక్ కాదు.. అలాచేసే దమ్ముందా? అంటూ చంద్రబాబుకు జగన్ ఛాలెంజ్ ..

AP CM YS Jagan

AP CM Jagan: ఏపీ సీఎం వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan reddy) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎక్కడికో వెళ్లి ఫేక్ సెల్ఫీ పిక్‌లు (Selfie pic) దిగుతూ ఈ ముసలాయన సైనా అని ఛాలెంజ్ (challenge) విసురుతున్నాడు. ఛాలెంజ్ అంటే సెల్ఫీ పిక్ కాదు చంద్రబాబు.. అంటూ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేను చంద్రబాబుకు ఓ సవాల్ విసిరుతున్నా.. దమ్ముంటే.. మీ ప్రభుత్వం హయాంలో ప్రతి ఇంటికి వెళ్లి అక్కచెల్లెమ్మలకు నీవు ఏం చేశావో చెప్పి సెల్ఫీ దిగు.. దానిని గొప్ప సెల్ఫీ అంటారు. అలాచేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని జగన్ ప్రశ్నించారు.

AP CM Jagan : పిల్లలను బడికి పంపేలా అమ్మఒడి.. ఇంటర్మీడియట్‌ వరకూ వర్తింపు : సీఎం జగన్

బుధవారం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేశారు. అనంతరం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం రెండో విడత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి జగన్ విడుదల చేశారు. రాష్ట్రంలోని రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, వెలమ, ఆర్యవైశ్య కులాలకుచెందిన లబ్ధిదారులైన మహిళల ఖాతాల్లో 15వేలు చొప్పున ఏపీ ప్రభుత్వం నిధులను జమ చేస్తుంది. ఇప్పటికే గతేడాది తొలి విడత 3.92 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ. 589 కోట్లు జమ చేసింది. తాజాగా 4,39,068 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 658 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి జమచేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

AP CM YS Jagan: మహిళలకు గుడ్‌న్యూస్.. మార్కాపురంలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇలా..

ఏపీలో ఏ కుటుంబాన్ని తీసుకున్నా, ఏ గ్రామాన్ని తీసుకున్నా, ఏ జిల్లాను తీసుకున్నా గత ప్రభుత్వంలో ఇంటింటికీ జరిగిన మంచి ఎంత? ఈ ప్రభుత్వం హయాంలో జరిగిన మంచి ఎంత? బేరీజు వేసుకోగల సత్తా చంద్రబాబుకు ఉందా అని జగన్ ఛాలెంజ్ విసిరారు. గడప నుంచి గ్రామం, పట్టణం వరకు ప్రతీ ఇంటికి మేలు చేశానని వెలుగెత్తి చెప్పి సెల్ఫీ దిగే దమ్ము నాకు ఉందని, దీనిపై చంద్రబాబుకు ఛాలెంజ్ చేస్తున్నానని జగన్ అన్నారు. ఐదేళ్ల పాలనలో ఒక్క ఇల్లు చంద్రబాబు లబ్ధిదారులకు ఇవ్వలేదని జగన్ ఆరోపించారు.

YS Jagan Mohan Reddy : పొత్తులపై సీఎం జగన్ కీలక ప్రకటన

చాలెంజ్ విసిరే అర్హత, స్టిక్కర్లు అతికించే అర్హత చంద్రబాబు నీకుఎక్కడ ఉంది అని రైతన్నలు, అక్కాచెల్లెమ్మలు నిలదీసి అడగాలని జగన్ పిలుపునిచ్చారు. దేశంలో ఈబీసీ నేస్తం లాంటి పథకం లేదని, రెండేళ్లలో రూ. 1,258కోట్లు ఈబీసీ నేస్తం ద్వారా మహిళల ఖాతాల్లో జమ చేశామని సీఎం జగన్ అన్నారు. ఈబీసీ నేస్తం లాంటి పథకాలు మేనిఫెస్టోలో లేకపోయినా అమలు చేస్తున్నా అని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.