CMRF Case : 10టీవీ చేతిలో సీఎంఆర్ఎఫ్ కేసు రిమాండ్‌ రిపోర్ట్

ఏపీలో సంచలనం కలిగించిన CMRF రిమాండ్ రిపోర్ట్‌ 10టీవీ చేతిలో ఉంది. ఈ కేసులో నలుగురు సచివాయ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.

CMRF Case : 10టీవీ చేతిలో సీఎంఆర్ఎఫ్ కేసు రిమాండ్‌ రిపోర్ట్

Secretariat

CMRF case accused remanded : ఏపీలో సంచలనం కలిగించిన CMRF రిమాండ్ రిపోర్ట్‌ 10టీవీ చేతిలో ఉంది. ఈ కేసులో నలుగురు సచివాయ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. చలువాయి సుబ్రహ్మణ్యం, సోక రమేశ్‌, చదివాడ మురళీకృష్ణ, కొండెపూడి జగదీష్‌ ధనరాజ్‌ అలియాస్ నాని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం వారంతా మచిలీపట్నం జైలులో ఉన్నారు. కోవిడ్ పరీక్షల అనంతరం రాజమండ్రి జైలుకు తరలించనున్నారు.

ఈ కేసును దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు 2014 నుంచి అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. సచివాలయ సిబ్బందే ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు తేల్చారు. మొత్తం 88 నకిలీ క్లెయిమ్‌లను గుర్తించగా… లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం అయినట్లు నిర్ధారించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు ప్రధాన నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. వీరిపై అవినీతి నిరోధక చట్టం 2018లోని సెక్షన్‌ 13(1), IPC 409, 420, 468, రెడ్‌ విత్ 120-Bతోపాటు ఐటీ యాక్టు సెక్షన్ 65, 66C, 66D కింద కేసులు నమోదు చేశారు.

Corona Vaccine : కరోనా వ్యాక్సిన్ తో డయాలసిస్ రోగుల్లో ఇన్‌ఫెక్షన్ ముప్పు తగ్గుదల

ఈ నెల 21న కేసు రిజిస్టర్‌ చేసిన ఏసీబీ అధికారులు… పేదల డేటా సేకరించి సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. తప్పుడు పేర్లు, తప్పుడు పత్రాలతో CMRF నిధులు నొక్కేసినట్లు తేల్చారు ఏసీబీ అధికారులు. CMRFలో అక్రమాలు జరిగినట్లు అధికారుల ఫిర్యాదుతో ఏసీబీ విచారణ జరిపింది. CMRFలాగిన్ ఐడీ, పాస్ వర్డ్‌లని సేకరించి ఫోర్జరీ పత్రాలు, తప్పుడు క్లెయిమ్స్‌తో నిధులు కాజేసినట్లు గుర్తించారు. వైద్య సహాయం అవసరంలేని వారి ఆధార్‌లను సైతం లింక్‌ చేసినట్లు, చిన్న ఆపరేషన్‌కు కూడా భారీగా బిల్లులు పెట్టినట్లు గుర్తించారు. అయితే.. అక్రమార్కులు లబ్ధిదారులకు పూర్తి సొమ్ము ఇవ్వలేదని, 80శాతానికి పైగా కాజేశారని ఏసీబీ గుర్తించింది.

ఈ కేసులో ఇప్పటికే ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న 50 మందిని పూర్తిస్థాయిలో విచారించింది ఏసీబీ. చెన్నై, బెంగళూరు E.N.T ఆస్పత్రుల్లో చికిత్స పొందినట్లు నకిలీ పత్రాలు సృష్టించారని పేర్కొంది. మరికొందరి నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తోంది. దీంతో ఈ కేసులో ఎప్పుడు, ఎవరిని అరెస్ట్ చేస్తారోనని సచివాలయ ఉద్యోగుల్లో అలజడి మొదలైంది.