AP Crime : 78 సిమ్ కార్డులు మార్చి..వెంటాడి వేధించి కావ్యను కాల్చి చంపిన సురేశ్ రెడ్డి

AP Crime : 78 సిమ్ కార్డులు మార్చి..వెంటాడి వేధించి కావ్యను కాల్చి చంపిన సురేశ్ రెడ్డి

Shooted On A Woman At Nellore District

Shooted on a Woman at Nellore District: నెల్లూరు జిల్లాలో కావ్య కాల్పుల ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సురేశ్ రెడ్డి వేధింపులు భరించలేక కావ్య అతని నంబర్ ని బ్లాక్ చేసింది. దీంతో సురేశ్ రెడ్డి పదే పదే సిమ్ లు మార్చి వెంటాడి వేధించాడు. కేవలం కావ్యను వేధించటానికే సురేశ్ రెడ్డి రెండు కాదు మూడు కాదు ఏకంగా 78 సిమ్ కార్డులు మార్చి వేధింపులకు పాల్పడ్డాడు. అలా వెంటాడి, వేధించి చివరకు అతని ఉన్మాదానికి కావ్య ప్రాణాల్ని బలితీసుకున్నాడు. తుపాకితో కాల్చి కావ్య ప్రాణాలు తీశాడు. రెండేళ్ల క్రితం తాటిపర్తి జాతరలో కావ్యను చూసిన సురేశ్ రెడ్డి ఆమెను ఇష్టపడ్డాడు. కానీ కావ్యకు ఇష్టం లేదని చెప్పినా సరే సురేశ్ రెడ్డి కావ్య వెంటపడటం మానలేదు.అలా వెంటాడి వేధించి కావ్యను కాల్చి చంపి అదే తుపాకితో తాను కూడా కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అతని ఉన్మాదానికి కావ్య బలి అయిపోయింది.

నెల్లూరు జిల్లాలోని పొదలకూరులో దారుణం ఘటన వివరాల్లోకి వెళితే..పొదలకూరు మండలం తాటిపర్తికి చెందిన సురేశ్‌రెడ్డి, కావ్య సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. సురేశ్ రెడ్డి బెంగళూరులో, కావ్య ముంబాయిలో పనిచేస్తున్నారు.ప్రస్తుతం వర్క్‌ఫ్రమ్‌ హోం నడుస్తుండడంతో.. వీరిద్దరూ తమ స్వగ్రామమైన తాటిపర్తి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కొంతకాలంగా.. ప్రేమ పేరుతో సురేశ్​ కావ్య వెంటపడ్డాడు. రెండు ఏళ్ల క్రితం కావ్యను తాటిపర్తి జాతరలో చూసి మనస్సు పారేసుకున్నాడు సురేశ్ రెడ్డి. కానీ కావ్య మాత్రం సురేశ్ ను ఇష్టపడలేదు.కానీ సురేశ్ మాత్రం నిన్ను పెళ్లి చేసుకుని తీరుతాను అంటుండేవాడు. అలా కావ్యను పెళ్లి చేసుకునేందుకు తమ ఇంటి నుంచి పెద్దలను.. కావ్య ఇంటికి పంపించినట్టు సమాచారం. అయితే.. వీరి పెళ్లికి కావ్య కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.

దీంతో.. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో.. సురేశ్‌ కావ్య ఇంటికి వెళ్లి తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం తానూ తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొనఊపిరితో ఉన్న కావ్యను స్థానికులు హుటాహుటిన నెల్లూరు ఆస్పత్రికి తరలించగా.. మార్గంమధ్యలో ఆమె మృతిచెందింది. సమాచారం మేరకు పోలీసులతో కలిసి పొదలకూరు తహసీల్దార్‌ సుధీర్‌బాబు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు.

యువతిపై కాల్పుల ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ విజయరావు మాట్లాడుతూ.. కావ్యను సురేష్‌ రెడ్డి ఏకపక్షంగా ప్రేమించాడని తెలిపారు. ఈ క్రమంలో సురేశ్​ పంపిన పెళ్లి ప్రతిపాదనను కావ్య కుటుంబసభ్యులు తిరస్కరించినా సురేశ్ వినకుండా కావ్యను వేధించాడని తెలిపారు. ఈక్రమంలో కావ్య కోపం పెంచుకున్నసురేష్‌ రెడ్డి కాల్పులు జరిపాడని తెలిపారు. సురేశ్​ సెల్​ ఫోన్ల ఆధారంగా.. తుపాకీ ఎలా వచ్చిందని ఆరా తీస్తున్నామని తెలిపారు.

కావ్య రెడ్డిపై సురేష్‌ రెడ్డి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. రెండో రౌండ్‌ కాల్పుల్లో కావ్య తల నుంచి తూటా దూసుకెళ్లిందని తెలిపారు. ఒకే గ్రామానికి చెందిన కావ్యకు మెసేజ్‌లు పెట్టే ఇబ్బంది పెట్టేవాడు.పెళ్లి చేసుకుంటానని గతనెల యువతి ఇంటికి పెద్దలను పంపాడు. పెళ్లి ప్రతిపాదనను కావ్య కుటుంబసభ్యులు తిరస్కరించారు. ఈ క్రమంలో కావ్య ఇంటికి వెళ్లి, అడ్డువచ్చిన కావ్య చెల్లెలిని తోసేసి కావ్యపై కాల్పులు జరిపాడు. సురేశ్​​ వాడిన తుపాకీపై మేడ్‌ ఇన్‌ యూఎస్‌ఏ అని ఉంది. అతని తుపాకీ ఎలా వచ్చిందని ఆరా తీస్తున్నాం. అతడికి చెందిన 2 సెల్‌ఫోన్లు సీజ్‌ చేశాం. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తాం అని తెలిపారు.