ఏపీకి బిగ్ షాక్ : ఇసుక దోపిడీపై రూ.100 కోట్ల జరిమానా

రోజుకు 2వేల 500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇచ్చింది

  • Published By: veegamteam ,Published On : April 4, 2019 / 08:14 AM IST
ఏపీకి బిగ్ షాక్ : ఇసుక దోపిడీపై రూ.100 కోట్ల జరిమానా

రోజుకు 2వేల 500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇచ్చింది

దోపిడీ ఎక్కడుందీ.. ఎవరు దోచుకుంటున్నారు.. ఇసుక అక్రమ రవాణానే లేదు.. అంతా కంప్యూటరీకరణ అంటూ చెప్పుకొచ్చిన ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల ముందు బిగ్ షాక్ తగిలింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ తవ్వకాలపై రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశించింది. కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపైనే ఈ జరిమానా విధించటం సంచలనంగా మారింది. 

రోజుకు 2వేల 500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇచ్చింది. ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్, అనుమోలు గాంధీ పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.

సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని నిర్థారించింది గ్రీన్ ట్రిబ్యునల్. ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా జరుపుతున్న ఇసుక తవ్వకాలను ఆపాలని ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఆధారంగా ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది.