AP CPS : సీపీఎస్ విషయంలో ఏపీ సర్కార్ కొత్త ప్రతిపాదన

పోలీసుల ఆంక్షలు విధించినా భారీగా ఉపాధ్యాయులు విజయవాడకు తరలివచ్చారు. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వైపు వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే.. ఎక్కడి వారిని అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి.. యూటీఎఫ్‌ ఆందోళనలను అడ్డుకున్నారు...

AP CPS : సీపీఎస్ విషయంలో ఏపీ సర్కార్ కొత్త ప్రతిపాదన

Ap Cps

AP Government New Proposal In CPS : సీపీఎస్‌పై ఉపాధ్యాయులు రోడ్డెక్కిన వేళ… ఏపీ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. సీపీఎస్ బదులుగా జీపీఎస్‌ ను ప్రతిపాదించింది. గ్యారెంట్‌ పెన్షన్‌ స్కీమ్‌ను ఉద్యోగ సంఘాల ముందు ఉంచింది ఏపీ సర్కార్. ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన జీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలు అపనమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. కొత్త స్కీం నమ్మదగినదిగా లేదని ప్రభుత్వానికి చెప్పామని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. పీఆర్సీ చర్చల్లో ఇచ్చిన హామీలు అమల్లోకి రాకపోవడంపై.. కమిటి దృష్టికి తీసుకెళ్లామని బండి శ్రీనివాసరావు చెప్పారు.

Read More : Nara Lokesh : మడమతిప్పిన వారిని నిలదీయొద్దా ? CPS రద్దు చేయాలి

సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌, ఆదిమూలపు సురేశ్‌, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ ఉన్నారు. వివిధ ఉద్యోగాల సంఘాలతో మంత్రుల కమిటీతో చర్చించిన తర్వాత తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఇక 2022, ఏప్రిల్ 25వ తేదీ సోమవారం సీపీఎస్ రద్దు కోరుతూ యూటీఎఫ్ నేతలు చేపట్టిన ఆందోళనతో విజయవాడ ఉక్కిరి బిక్కిరి అయ్యింది.

Read More : Police Special Surveillance : ఉపాధ్యాయుల చలో సీఎంఓ కార్యక్రమంపై పోలీసులు ప్రత్యేక నిఘా

పోలీసుల ఆంక్షలు విధించినా భారీగా ఉపాధ్యాయులు విజయవాడకు తరలివచ్చారు. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వైపు వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే.. ఎక్కడి వారిని అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి.. యూటీఎఫ్‌ ఆందోళనలను అడ్డుకున్నారు. యూటీఎఫ్‌ ముట్టడి పిలుపుతో విజయవాడలో పోలీసుల తీరు సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. తెల్లవారుజాము నుంచే అన్ని కూడళ్లలో భారీగా పోలీసులు మోహరించారు. బస్సులు, రైళ్లలో విస్తృతంగా తనిఖీలు చేశారు. సీఎం క్యాంప్‌ ఆఫీసుకు వెళ్లే దారిలోనే 650 మంది పోలీసులను మోహరించి.. బారికేడ్లు పెట్టారు. స్థానికులను కూడా వదలకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు డీజీపీ నేరుగా బందోబస్తును పర్యవేక్షించారు.