Police Special Surveillance : ఉపాధ్యాయుల చలో సీఎంఓ కార్యక్రమంపై పోలీసులు ప్రత్యేక నిఘా

పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులు సైతం విజయవాడ నగర వీధుల్లో పహారా కాస్తున్నారు.

Police Special Surveillance : ఉపాధ్యాయుల చలో సీఎంఓ కార్యక్రమంపై పోలీసులు ప్రత్యేక నిఘా

Vijayawada (1)

Updated On : April 25, 2022 / 11:06 AM IST

teachers CHALO CMO : సిపిఎస్ రద్దు చేయాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అందోళనకు దిగాయి. సీఎం జగన్ పాదయాత్ర సమయంలో సిపిఎస్ ను రద్దు చేస్తామని హమీ ఇచ్చారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వారం లోపు పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పిన సీఎం జగన్ నోరు మెదపటం లేదంటూ ఉపాద్యాయు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో మార్చ్ 31 లోపు రోడ్ మ్యాప్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు.

వేలాది మంది ఉపాధ్యాయులు విజయవాడకు చేరుకున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గరకు ఉపాధ్యాయులు చేరుకున్నారు. సిపిఎస్ రద్దు కోసం మరొకసారి ఉపాధ్యాయులు నినదించనున్నారు. ప్రభుత్వం చేసే కాలయాపనపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 12 సార్లు సమావేశాలు సమీక్ష నిర్వహించినా.. అడుగుముందుకు పడలేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. సిపిఎస్ రద్దు కోసం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Teachers’ Unions : సిపిఎస్ రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాల ఆందోళన

పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులు సైతం విజయవాడ నగర వీధుల్లో పహారా కాస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ బెంజ్ సర్కిల్ ప్రధాన కూడళ్లలో పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. సిపిఎస్ రద్దు కోసం పోరాటానికి ఉపాధ్యాయ సంఘాల కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఆందోళనకు వచ్చిన వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు.