Ap New Districts : ఏపీలో కొత్త జిల్లాలు.. అభ్యంతరాలు, సూచనల పరిశీలనకు ప్రత్యేక కమిటీ

ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల కార్యకలాపాలను ప్రారంభించేందుకు కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం.. ఈ క్రమంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, సలహాలు, సూచనల పరిశీలన కోసం ప్రత్యేక కమిటీని

Ap New Districts : ఏపీలో కొత్త జిల్లాలు.. అభ్యంతరాలు, సూచనల పరిశీలనకు ప్రత్యేక కమిటీ

Ap New Districts

AP New Districts : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు మార్చి 18 నాటికే ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని పట్టుదలగా ఉంది. మార్చి 15-17 మధ్య జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లా కేంద్రాలుగా ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలు విధులు నిర్వర్తిస్తారు.

ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల కార్యకలాపాలను ప్రారంభించేందుకు కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం.. ఈ క్రమంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, సలహాలు, సూచనల పరిశీలన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

Android 12 Feature : ఈ స్మార్ట్ ఫోన్లలోకి కూల్ ఆండ్రాయిడ్ 12 ఫీచర్ వస్తోంది.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!

ఈ కమిటీలో ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీసీఎల్ఏ సెక్రటరీ, అన్ని జిల్లాల కలెక్టర్లు ఉంటారు. కాగా, ఈ కమిటీకి విజ్ఞప్తులు చేసేందుకు ప్రజలకు 30 రోజుల సమయం ఇచ్చారు. ఈ విజ్ఞప్తులను కలెక్టర్లు సేకరిస్తారు. సలహాలు, సూచనలు, అభ్యంతరాలను జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక వెబ్ సైట్ (drp.ap.gov.in)కు ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తుండాలి.

ఈ విజ్ఞప్తులను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. సహేతుకమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటులో మార్పులు, చేర్పులు, సవరణలు ఉంటే సిఫారసు చేస్తుంది. ఒకవేళ, విజ్ఞప్తులు అసమంజసంగా ఉన్నట్టు అనిపిస్తే తిరస్కరించాలని సదరు రాష్ట్రస్థాయి కమిటీ సూచిస్తుంది. ఈ కమిటీ చేసిన సిఫారసులపై అంతిమ నిర్ణయం మాత్రం సీఎస్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీదే. ఉగాది నుంచి కొత్త జిల్లాలు తీసుకురావాలని సీఎం జగన్ ఇప్పటికే అధికారులు చెప్పిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేసింది ప్రభుత్వం. ఇప్పుడు 13 జిల్లాలు ఉండగా, కొత్తగా 13 జిల్లాలు ఏర్పడనున్నాయి. మార్చిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త జిల్లాల బిల్లు ప్రవేశపెట్టనున్నారు. కొత్త సంవత్సరాది ఉగాదికి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం కానుంది. అరకు నియోజకవర్గం భౌగోళికంగా పెద్దది కావడం, ఏకంగా నాలుగు జిల్లాల్లో ఉండటంతో ఆ నియోజకవర్గాన్ని మాత్రం రెండుగా విభజించారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అన్ని సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సిద్ధమైంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చే ప్రతి అభ్యంతరం, సూచనలను పరిగణలో తీసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన.

Sleep : అతిగా నిద్రపోతున్నారా!…అయితే జాగ్రత్త?

అందుకే అభ్యంతరాలు, సూచనలపై ఆషామాషీగా నిర్ణయం తీసుకోకుండా అన్ని అంశాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం మరో కమిటీ నియమించింది. జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రజల మనోభావాలకు సంబంధించి తమ దృష్టికొచ్చిన ప్రతి అంశాన్ని పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకోనుంది.

నెల రోజుల గడువు ముగిసిన తర్వాత.. వచ్చిన అభ్యంతరాలు, సూచనలను కమిటీ పరిశీలిస్తుంది. ఆ అభ్యంతరాలు ఎంతవరకు సహేతుకమైనవో తేలుస్తుంది. అదే విధంగా ప్రతి అభ్యంతరాన్ని పరిగణలో తీసుకోవాలా వద్దా అనేది కూడా కమిటీ సిఫారసు చేస్తుంది. కమిటీ స్క్రూటినీ ప్రక్రియ శాస్త్రీయంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కమిటీ సూచనల మేరకే.. జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో మార్పులు చేర్పులపై ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత తుది నిర్ణయముంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో అరకు, పాడేరు జిల్లాలు, పుట్టపర్తి జిల్లా కేంద్రం విషయాల్లో తీవ్ర అభ్యంతరాలున్నాయి. రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ కూడా ప్రజల్లో ఉంది.