AP High Court Judgment : ఏవీ ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట.. టీటీడీ ఈఓగా నియామకాన్ని సమర్థిస్తూ కీలక తీర్పు

ఏవీ ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. టీటీడీ ఈఓగా ఆయన నియామకాన్ని సమర్థిస్తూ కోర్టు కీలక తీర్పునిచ్చింది. అదనపు ఈఓగా ఉన్న ధర్మారెడ్డిని ఈఓగా నియమించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన రిట్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. టీటీడీ ఈఓగా నియమించేందుకు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది.

AP High Court Judgment : ఏవీ ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట.. టీటీడీ ఈఓగా నియామకాన్ని సమర్థిస్తూ కీలక తీర్పు

AP High Court judgment

AP High Court Judgment : ఏవీ ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. టీటీడీ ఈఓగా ఆయన నియామకాన్ని సమర్థిస్తూ కోర్టు కీలక తీర్పునిచ్చింది. అదనపు ఈఓగా ఉన్న ధర్మారెడ్డిని ఈఓగా నియమించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన రిట్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. టీటీడీ ఈఓగా నియమించేందుకు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. తిరుపతికి చెందిన నవీన్‌ కుమార్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేసి.. ధర్మారెడ్డిని అదనపు ఈఓగానే కొనసాగించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

2019 లో ఏవీ ధర్మారెడ్డి డిప్యుటేషన్‌పై టీటీడీకి వచ్చారు. ఆయన 1991లో ఇండియన్‌ డిఫెన్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌ సర్వీస్‌ గ్రూపు-ఏ సర్వీసుల్లో యూపీపీఎస్సీ ద్వారా చేరారు. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ 2019లో ఆయనను కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు డిప్యుటేషన్‌పై పంపింది. ఈ ఏడాది మే14తో డిప్యుటేషన్‌ కాలపరిమితి కూడా ముగిసింది.  అయినప్పటికీ ఆయనను వెనక్కి పంపకుండా అదనపు ఈఓ స్థాయి నుంచి ఈఓగా పోస్టింగ్ ఇచ్చారు.

Battery Vehicles To Tirumala Srivaru : తిరుమల శ్రీవారికి విరాళంగా ఐదు బ్యాటరీ వాహనాలు

ఐడీఈఎస్‌ అధికారి అయిన ధర్మారెడ్డికి జిల్లా కలెక్టర్‌ స్థాయి అర్హత లేదని, అలాంటప్పుడు ఆయనను టీటీడీ ఈఓగా ఎలా నియమిస్తారంటూ పిటిషనర్ నవీన్‌ కుమార్‌రెడ్డి కోర్టులో దావా వేశారు.  ప్రభుత్వ ఉత్తర్వులను నిలుపు చేసి ఆ హోదాకు సమానమైన అర్హతలున్న వ్యక్తిని నియమించేలా ఆదేశాలివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ఈ పిటిషన్‌పై విచారించిన ఏపీ హైకోర్టు.. టీటీడీ ఈఓగా నియమించేందుకు కావాల్సిన అర్హతలన్నీ ధర్మారెడ్డికి ఉన్నాయని, ఆయనను ఈఓగా నియమించడంలో ఎలాంటి తప్పిదం జరుగలేదని స్పష్టం చేసింది.