Battery Vehicles To Tirumala Srivaru : తిరుమల శ్రీవారికి విరాళంగా ఐదు బ్యాటరీ వాహనాలు

తిరుమల శ్రీవారికి కరూర్‌ వైశ్యాబ్యాంక్‌ ఐదు బ్యాటరీ వాహనాలను విరాళంగా అందజేసింది. గురువారం (సెప్టెంబర్ 15,2022)న ఆలయ పరిసర ప్రాంతాల్లో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి. రమేశ్‌బాబు వాహనాల తాళాలు అందజేశారు.

Battery Vehicles To Tirumala Srivaru : తిరుమల శ్రీవారికి విరాళంగా ఐదు బ్యాటరీ వాహనాలు

battery vehicles to Tirumala Srivaru

Updated On : September 15, 2022 / 7:47 PM IST

Battery Vehicles To Tirumala Srivaru : తిరుమల శ్రీవారికి కరూర్‌ వైశ్యాబ్యాంక్‌ ఐదు బ్యాటరీ వాహనాలను విరాళంగా అందజేసింది. గురువారం (సెప్టెంబర్ 15,2022)న ఆలయ పరిసర ప్రాంతాల్లో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి. రమేశ్‌బాబు వాహనాల తాళాలు అందజేశారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సుమారు రూ. 30 లక్షల విలువ గల 8-సీటర్ బ్యాటరీతో నడిచే ఐదు వాహనాలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కెవిబి డైరెక్టర్లు, విజిఓ బాలిరెడ్డి, డీఐజానకిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tirumala Srivari Brahmotsavam : ఈ నెల 27నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పణ

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. వీరికి 18 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. నిన్న 72,540 మంది భక్తులు స్వామిని శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోగా 33,339 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.91 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు.