AP Covid Update : ఏపీలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు-46 కేసులు నమోదు

ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్న రాష్ట్రంలో 46 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇంతవరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య   23,18,751కి   చేరింది.

AP Covid Update : ఏపీలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు-46 కేసులు నమోదు

Ap Covid Update

AP Covid Update :  ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్న రాష్ట్రంలో 46 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇంతవరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య   23,18,751కి   చేరింది. నిన్న 134 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు తిరిగివెళ్లారు. దీంతో ఇంతవరకు కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 23,03,361కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 661 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  నిన్న రాష్ట్రంలో కోవిడ్ మరణాలు లేవు. రాష్ట్రంలో  ఇప్పటి వరకు   3,32, 37. 304 మంది శాంపిల్స్ పరీక్షించారు. ఇంత  వరకు కోవిడ్  వల్ల రాష్ట్రంలో 14, 729 మంది మరణించారు.

మరోవైపు   కరోనా   వైరస్  పుట్టిన చైనా దేశంలో మళ్లీ  కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.  ఆదేశంలో మళ్లీ లాక్ డౌన్ ఆంక్షలు విధించారు. ఈశాన్య న‌గ‌ర‌మైన చాంగ్‌చున్‌లో కొత్త వేరియంట్ బయటపడింది. దీంతో అధికారులు లాక్‌డౌన్ విధించారు.  ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు.

90 లక్షల జనాభా ఉన్న చాంగ్‌చున్‌లో కొత్త వేరియంట్ కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోందని అధికారులు వెల్లడించారు. దీంతో స్థానికులు ఎవ‌రూ ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావొద్దని ఆంక్షలు పెట్టారు. మరోవైపు కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రే నిత్యావ‌స‌రాల కోసం బ‌య‌ట‌కు వెళ్లాలని సూచించారు.

అది కూడా రెండు రోజుల‌కు ఒక‌సారి మాత్రమే బయటకు రావాలని ఆంక్షలు విధించారు. కోవిడ్ కేసులు మరోసారి పెరగటంతో స్కూల్స్ మరోసారి మూసి వేశారు అధికారులు.
Also Read : Raja Singh On TRS : ఎన్ని కేసులు వేసినా నన్ను ఓడించలేకపోయారు-రాజాసింగ్
శుక్రవారం  (మార్చి 11,2022)న   ఒక్కరోజే 1000 కేసులు నమోదు అయ్యాయి.  వారంలోపే   300 కేసులు నమోదు  కావటంతో మరోసారి చైనాలో కోవిడ్ భయాందోళనలు నెలకొన్నాయి.   ప్రపంచ  దేశాలన్నీ కోవిడ్ థర్డ్ వేవ్ నుంచి కూడా బయటపడ్డాయి. కానీ   చైనాలో మాత్రం పదే పదే కోవిడ్ కేసులు పెరుగుతున్న సందర్భాలు జరుగుతున్నాయి.