Minister Ambati Rambabu : కేంద్రం నిర్ణయానికి అభ్యంతరం తెలిపాం.. ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు

 జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా రాష్ట్రం కోసమే వెళ్తున్నారు.. రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడా అశ్రద్ద చెయ్యని ప్రభుత్వం మాదని అంబటి అన్నారు.

Minister Ambati Rambabu : కేంద్రం నిర్ణయానికి అభ్యంతరం తెలిపాం.. ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు

Minister Ambati Rambabu

YCP Leader Ambati Rambabu : కృష్ణా జలాల పై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మేము అభ్యంతరం తెలిపామని, ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖకూడా రాశారని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వడానికి వీలు లేదు. కొత్తగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వడం చట్ట విరుద్దం అని అంబటి అన్నారు. ఈ కొత్త నిర్ణయం రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని, దీనిపై న్యాయ పోరాటానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అంబటి రాంబాబు తెలిపారు.

Read Also : CM Jagan : కాపుల ఓట్లు చేజారకుండా సీఎం జగన్ మాస్టర్ ప్లాన్

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఇల్లీగల్ అని సుప్రీం కోర్టు లో కేసు వేస్తామని అంబటి రాంబాబు అన్నారు. మా వాదన వినిపిస్తామని, చట్టంలో క్లియర్ గా ఉంది కనుక కోర్టులో అనుకూలమైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రతీ నీటిబొట్టు తీసుకుని వస్తామని, వదులు కోవడానికి సిద్ధంగా లేమని అంబటి చెప్పారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా రాష్ట్రం కోసమే వెళ్తున్నారు.. రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడా అశ్రద్ద చెయ్యని ప్రభుత్వం మాదని అంబటి అన్నారు.

కేంద్రం ఏ ఒత్తిడికి గురై ఈ నిర్ణయం తీసుకుందో మాకు తెలీదు. మన హక్కులకోసం కోర్టుల్లో తెల్చుకుంటాం. మన హక్కు కోసం ఏ రాష్ట్రంతో అయినా, ఎలాంటి శక్తి తో అయినా పోరాటానికి రాజీపడే ప్రసక్తే లేదని అంబటి స్పష్టం చేశారు.