Kodali Nani : బాబు, పవన్ వి నీచ రాజకీయాలు : మంత్రి కొడాలి

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ పై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీని రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

Kodali Nani : బాబు, పవన్ వి నీచ రాజకీయాలు : మంత్రి కొడాలి

Kodali Nani

Kodali Nani criticized Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీని రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జీతాలు ఇచ్చి కొందరితో సీఎం జగన్ ను భూతులు తిట్టిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు.. ఎన్టీఆర్ విషయంలో ఇలాంటి కుట్రలు చేశారు.. పదవి, పార్టీ లాక్కుని ప్రాణాలు తీశారని ఆరోపించారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని కూడా రాజకీయంగా ఎదగకుండా అనగదొక్కేశారని విమర్శించారు.

వైస్సార్ ని కూడా రౌడీ అని, ఫ్యాక్షనిస్టు అని ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. పరిటాల రవి హత్య కేసులో జగన్ ఉన్నారని ఆనాడు ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. అమిత్ షా దగ్గరకి వెళ్ళడానికి చంద్రబాబుకి సిగ్గులేదా..? తిరుపతి వస్తే ఆయన కార్ పై రాళ్లు వేయించలేదా..? అని ప్రశ్నించారు. మోడీకి అమిత్ షాకి చంద్రబాబు గురించి తెలుసు..ఆయన్ను దరిదాపుల్లోకి కూడా రానివ్వరని తెలిపారు. మోడీని దింపాలని సోనియా, రాహుల్ తో కలిసి తిరిగిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని అమిత్ షా దగ్గరకి వెళ్తారని నిలదీశారు.

YCP : ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం

36 గంటలు దొంగ దీక్షలు అంటూ మరో డ్రామా మొదలెట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుని ఎన్టీఆర్ ఏమన్నారో ఆ మాటలే తాను అంటున్నానని అన్నారు. నిత్యం పోలీసుల రక్షణలో బ్రతుకుతూ పోలీసుల్ని తిడుతూ ఉంటారని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు కెపాసిటీ ఏంటో ఈరోజు తేలిపోయిందన్నారు. రాష్ట్ర బంద్ కి పిలుపునిస్తే ఒక్క బడ్డీ కొట్టు కూడా మూయలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు బంద్ కు పిలుపునిస్తే హెరిటేజ్ ఫ్రెష్ కూడా మూత వెయ్యలేదని పేర్కొన్నారు.

తన అభిమానులు పోసాని ఇంటిపై దాడి చేస్తే ఖండించని పవన్ ఇప్పుడు బయటకి వచ్చారని విమర్శించారు. పోసాని ఇంటిపై నీ అభిమానులు రాళ్లు వేస్తే కేంద్ర హోంశాఖకి ఎందుకు పిర్యాదు చెయ్యలేదని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసే ఈ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ అటు ఇటు కానీ వ్యక్తి.. అలాంటి వ్యక్తితో యుద్ధాలు, ఛాలెంజ్ లు తాము తీసుకోబోమని చెప్పారు. చంద్రబాబు చేసిన పాపాలకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ లోకేష్ అని ఏద్దేవా చేశారు. ముందు లోకేష్ ఎమ్మెల్యే అవ్వాలి.. అప్పుడు మాట్లాడాలన్నారు.

Chandrababu : టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు 36 గంటలపాటు దీక్ష

గంజాయి వ్యాపారం మొదలుపెట్టింది చంద్రబాబు, లోకేష్ అని ఆరోపించారు. అధికారంలో ఉండగా హెరిటేజ్ లో గంజాయి అమ్మకాలు జరిపారు.. జగన్ సీఎం అయ్యాక గంజాయి వ్యాపారం పోయిందని బాధలో ఉన్నారని అన్నారు. గతంలో చంద్రబాబు చేసిన పనులకు ఇప్పుడు వడ్డీతో సహా అనుభవిస్తున్నారని తెలిపారు. జగన్ ని ఎన్ని అవమానాలకు గురిచేశాడో చంద్రబాబు మర్చిపోయారా అని అన్నారు.