Mekapati Gautam Reddy : నేడు నెల్లూరుకు మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయం

హెలికాప్టర్ లో గౌతమ్ రెడ్డి పార్థివ దేహంతో తల్లి, భార్య వెళ్లనున్నారు. ఇప్పటికే గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి నెల్లూరుకు బయలు దేరారు.

Mekapati Gautam Reddy : నేడు నెల్లూరుకు మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయం

Mekapati (1)

Mekapati Gautam Reddy : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని నేడు నెల్లూరుకు తరలించనున్నారు. హైదరాబాద్ నుండి నెల్లూరుకు గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు తరలించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్ లో గౌతమ్ భౌతికకాయాన్ని తరలించనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో కుటుంబ సభ్యులు తరలించనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి నెల్లూరులోని నివాసానికి తరలించనున్నారు. ఈ రోజు రాత్రికి అమెరికా నుండి గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి రానున్నారు.

హెలికాప్టర్ లో గౌతమ్ రెడ్డి పార్థివ దేహంతో తల్లి, భార్య వెళ్లనున్నారు. ఇప్పటికే గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి నెల్లూరుకు బయలు దేరారు. రేపు ఉదయగిరిలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతక్రియలు నిర్వహించనున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ వద్ద గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మొదటగా స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని ప్రకటించారు. కానీ ఉదయగిరిలో అంత్యక్రియలు జరుగనున్నాయి.

Mekapati Goutham Reddy : మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం.. సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలను ఖండించిన కుటుంబం

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం ఆయనకు గుండెపోటు రాగా… హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే గౌతమ్‌రెడ్డికి శ్వాస ఆడట్లేదని డాక్టర్లు తెలిపారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలు షాక్‌కు గురయ్యారు. ఇటీవలే ఆయన దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్నారు.

ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన స్టాల్‌ను ప్రారంభించి.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఇండస్ట్రీ అవకాశాల గురించి వివరించారు. ఇటీవలే ఆయన ఇండియాకు తిరిగి వచ్చారు. 1971లో మేకపాటి గౌతంరెడ్డి జన్మించారు. నెల్లూరు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019లో రెండు సార్లు ఆత్మకూరు నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం ఇండస్ట్రీస్‌, కామర్స్‌, ఐటీ అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిగా పనిచేస్తున్నారు.