AP PRC Fight : ఏపీలో జీతాలపై సందిగ్ధత.. అధికారులపై క్రమశిక్షణా చర్యలు

వేతనాల బిల్లులను ప్రాసెస్ చేయని అధికారులపై చర్యలు తీసుకొనేందుకు ఆర్ధిక శాఖ రెడీ అయిపోయింది. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేయకుండా ఆదేశాలను ఉల్లంఘించిన...

AP PRC Fight : ఏపీలో జీతాలపై సందిగ్ధత.. అధికారులపై క్రమశిక్షణా చర్యలు

Ap Prc

AP Ministry Of Finance : ఒకటో తారీఖు దగ్గరకు వస్తుంది.. అయినా ఎవరూ దగ్గడం లేదు.. పట్టువీడటం లేదు. దీంతో ఫిబ్రవరి ఒకటో తారీఖున ఉద్యోగుల అకౌంట్లలలో జనవరి నెల జీతాలు పడటం అనుమానంగానే కనిపిస్తోంది.. జీతాలు ప్రాసెస్ చేయాల్సిందే అని ప్రభుత్వం.. మీరేం చేసినా ప్రాసెస్ చేసేది లేదంటూ ఉద్యోగులు భీష్మించుకోవడంతో ఒకటో తారీఖు వస్తున్న కొద్ది జీతాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలివ్వాలన్న విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. జీతాలు ప్రాసెస్‌ చేయకపోతే చర్యలు తప్పవని ట్రెజరీ ఉద్యోగులకు ప్రభుత్వం వరుస పెట్టి సర్క్యూలర్స్‌ జారీ చేస్తూనే ఉంది.

Read More : Bhaskar Naidu : 10వేలకు పైగా పాములు పట్టిన అతడు.. కాటుకు గురై ఆసుపత్రిలో..

తాజాగా…వేతనాల బిల్లులను ప్రాసెస్ చేయని అధికారులపై చర్యలు తీసుకొనేందుకు ఆర్ధిక శాఖ రెడీ అయిపోయింది. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేయకుండా ఆదేశాలను ఉల్లంఘించిన డీడీఓలు, ట్రెజరీ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆర్ధిక శాఖ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. 2022 జనవరి 29 తేదీ సాయంత్రం 6 గంటల వరకూ తమ విధుల్లో విఫలమైన వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త వేతన స్కేళ్ల ప్రకారం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, వేతనాలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ట్రెజరీస్ డైరెక్టర్ కు, పే అండ్ అకౌంట్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సిబ్బంది సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచిస్తూ ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. పెండింగ్ డీఏలతో కూడిన పాత జీతాన్నే ఇవ్వాలన్నది ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌. ఇందుకు తగ్గట్టుగా జనవరి నెలకు పాత జీతాలను డీఏలతో కలిపి ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Read More : Delhi Vijay Chowk : బీటింగ్ ది రిట్రీట్.. స్పెషల్ అట్రాక్షన్ డ్రోన్ షో

ఇదిలా కొనసాగుతుండగా.. ఉద్యోగులు చర్చలకు రాకపోవడంపై మంత్రుల కమిటీ సీరియస్ గా పరిగణిస్తోంది. మంత్రుల కమిటీగా తాము ప్రతిరోజు వస్తున్నా..ఉద్యోగ సంఘాల నేతలు రావడం లేదన్నారు. ఫిబ్రవరి 07వ తేదీ సమ్మె నోటీసు జారీ చేసిన ఉద్యోగ సంఘాలు పోరాటాన్ని ఉధృతం చేస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో శనివారం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరహార దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో జీతాలు ప్రాసెస్ అవుతాయా ? లేదా ? అనేది చూడాలి.