Darsi TDP: ఖాతా తెరిచిన టీడీపీ.. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయితీ కైవసం

ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ టీడీపీ కైవసం చేసుకుంది.

Darsi TDP: ఖాతా తెరిచిన టీడీపీ.. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయితీ కైవసం

Darsi

Darsi TDP: ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ టీడీపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో అధికారంతో పాటు, దర్శిలో అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండడంతో వైసీపీ ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకోగా.. చివరకు విజయం మాత్రం టీడీపీ వశం అయ్యింది. మొత్తం 13వార్డుల్లో టీడీపీ గెలవగా.. ఆరు వార్డుల్లో వైసీపీ గెలిచింది. ఒక వార్డును వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది.

స్థానికంగా ఉన్న పొలిటికల్ ఈక్వేషన్‌లో వైసీపీ నగరపంచాయితీ కోల్పోయినట్లుగా తెలుస్తుంది. టీడీపీ విజయంతో దర్శిలో నిరుత్సాహంలో ఉన్న క్యాడర్ ఉత్సాహంగా కనిపిస్తుంది. వైసీపీపై ఉన్న వ్యతిరేకతతోనే విజయం దక్కించుకున్నట్లుగా చెబుతున్నారు అక్కడి నేతలు.

అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, బూచేపల్లి ముఖ్యమైన నేతలు ఉన్నప్పటికీ, వైసీపీకి విజయ అవకాశాలు ఎక్కువగా వచ్చినట్లుగా చెబుతున్నారు. శిద్దా రాఘవరావు వంటి కీలకమైన నేతలు కూడా అక్కడ వైసీపీలోనే ఉన్నారు. ఏలూరు, గొట్టిపాటి, స్వామి వంటి ముఖ్యమైన టీడీపీ నేతలు నియోజకవర్గంలో కీలకపాత్ర పోషించారు. పోల్ మేనేజ్‌మెంట్‌లో వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ దర్శి మోడల్‌ స్కూల్‌లో జరిగింది. ఓట్ల లెక్కింపు 5 హాల్స్‌లో సిద్ధం చేసుకున్నారు. మొత్తం 38 టేబుల్స్‌ వద్ద ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఐదుగురు ఎన్నికల అధికారులు, 10 మంది సహాయ ఎన్నికల అధికారులు, మరో 10 మంది కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, మరో 99 మంది సిబ్బందిని ఓట్ల లెక్కింపులో పాల్గొన్నారు.

AP Governor: ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. విమానంలో హైదరాబాద్‌కు తరలింపు