Giridhar Aramane : ఏపీ కొత్త సీఎస్ ఆయనేనా? తెరమీదకు కేంద్ర రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్ పేరు

ఏపీ సీఎం జగన్ తో కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమణె భేటీ కావడం ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 1988 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన గిరిధర్.. ఏపీ కేడర్ లో విధులు నిర్వహిస్తున్నారు.

Giridhar Aramane : ఏపీ కొత్త సీఎస్ ఆయనేనా? తెరమీదకు కేంద్ర రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్ పేరు

Giridhar Aramane : ఏపీ సీఎం జగన్ తో కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమణె భేటీ కావడం ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 1988 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన గిరిధర్.. ఏపీ కేడర్ లో విధులు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ఏపీలో కొత్త సీఎస్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీ తదుపరి సీఎస్ గా జవహర్ రెడ్డిని నియమిస్తారంటూ జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ తో.. గిరిధర్ భేటీ కాడం ప్రాధాన్యత సంతరించుకుంది. గిరిధర్ అరమణె సీనియార్టీ విషయంలో ముందంజలో ఉన్నారు.

Also Read : IAS Officers Transfer : ఏపీలో ఆరుగురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

ఏపీ నూతన చీఫ్ సెక్రటరీ ఎంపిక కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం సీఎస్ గా ఉన్న సమీర్ శర్మ రిటైర్ కాబోతున్నారు. అనారోగ్యం కారణంగా ఆయన రిటైర్ అవుతున్నారు. సమీర్ శర్మ స్థానంలో సీనియర్ ఐఏఎస్ అయిన జవహర్ రెడ్డిని ఏపీ కొత్త సీఎస్ గా నియమిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ కేడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్, కేంద్ర రక్షణశాఖ కార్యదర్శిగా పని చేస్తున్న గిరిధర్ అరమణె సీఎం జగన్ ను కలవడంతో కొత్త చర్చ మొదలైంది. సీఎస్ రేసులో గిరిధర్ పేరు తెరమీదకు వచ్చింది. ఆయన రిటైర్ మెంట్ కు దగ్గరలో ఉన్నారు. దీంతో తనను ఏపీ సీఎస్ గా ఎంపిక చేయాలని సీఎం జగన్ ను కలిసి ఆయన విజ్ఞప్తి చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

Also Read : Reservation For Home Guards : ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం.. కానిస్టేబుల్ పోస్టుల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు

కాగా, జవహర్ రెడ్డికే సీఎస్ గా అవకాశం కల్పించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయం నుంచి కూడా సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు జవహర్ రెడ్డి. పైగా జగన్ కు నమ్మకస్తుడు కూడా. కాబట్టి, సీఎస్ గా జవహర్ రెడ్డిని నియమిస్తారని ఐఏఎస్ వర్గాల్లో టాక్. ఇలాంటి పరిస్థితుల్లో సడెన్ గా గిరిధర్ అరమణె వచ్చి సీఎం జగన్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. కొత్త చర్చ మొదలైంది. కొత్త సీఎస్ ఎవరు? సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.