DGP KV Rajendranath Reddy : గంజాయి నిర్మూలనపై మరింత దృష్టి : ఏపీ డీజీపీ

ఏపీ నూతన డీజీపీగా కేవీ.రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ బాధ్యతలను స్వీకరించారు. గౌతమ్ సవాంగ్ నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు.

DGP KV Rajendranath Reddy : గంజాయి నిర్మూలనపై మరింత దృష్టి : ఏపీ డీజీపీ

Ap Dgp

AP new DGP KV Rajendranath Reddy : ఎర్ర చందనం సమస్యపై దృష్టి పెట్టామని ఏపీ నూతన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గంజాయి నిర్మూలనపై మరింత దృష్టి పెడతామని పేర్కొన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యామ్నాయ పంటల సహకారం కూడా అందిస్తామని వెల్లడించారు. ఫోరెన్సిక్ మొబైల్ ల్యాబ్స్ ను ప్రభుత్వం ఇచ్చిందని ఏపీ నూతన డీజీపీగా కేవీ.రాజేంద్రనాథ్ రెడ్డి న్నారు. మహిళలపై నేరాలను త్వరితగతిన విచారణ‌ చేయాలన్నారు. చిన్న సమస్యలుగా ప్రారంభమై పెద్దవిగా మారకుండా పోలీసులు చూడాలని పేర్కొన్నారు.

ఏపీ నూతన డీజీపీగా కేవీ.రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ బాధ్యతలను స్వీకరించారు. గౌతమ్ సవాంగ్ నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ మత పరమైన అంశాలపై ప్రజాప్రతినిధుల సహకారంతో పరిష్కరించాలని పోలీసులను కోరుతున్నామని తెలిపారు.

AP New DGP : ఏపీ నూతన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, గౌతమ్ సవాంగ్‌‌కు వీడ్కోలు

ఏపీ పోలీసు పేరు నిలబెట్టేలా అహర్నిశలూ పనిచేస్తామని చెప్పారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారనే అపవాదు రాకుండా చూస్తామని చెప్పారు. కొత్త జిల్లాలకు త్వరలో ఎస్పీలను నియమిస్తామని తెలిపారు. మతపరమైన ఘర్షణ వాతావరణం తగ్గించేలా పోలీసులు పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్ధలపై దాడులను సహించబోమని హెచ్చరించారు. నక్సల్ సమస్య ఈరోజుతో సమసిపోయేది కాదన్నారు.

ఈ సందర్భంగా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ రాజేంద్రనాధ్ రెడ్డి చాలా నిబద్ధత కలిగిన అధికారి అని కొనియాడారు. డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలను నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. రాజేంద్రనాథ్ రెడ్డికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దిశ యాప్ డౌన్ లోడ్స్ 1,10,00,446 జరిగాయని తెలిపారు. ఏపీ సేవా ద్వారా ఎఫ్ఐఆర్ లు 40 వేలకు పైగా డౌన్ లోడ్ చేసుకున్నారని చెప్పారు.

AP DGP: సవాంగ్‌పై వేటు.. ఏపీకి కొత్త డీజీపీ.. ఉత్తర్వులు జారీ

ఏపీ కాప్స్, ఏపీ పోలీస్ యాప్ లు అంతర్గత నిర్వహణకు ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళల, ఎస్సీ-ఎస్టీ కేసుల పరిష్కారం త్వరిత గతిన జరిగేలా చూసేందుకు ఒక టెక్నాలజీ ఇచ్చామని చెప్పారు. పోలీసు స్టేషన్లు అన్నీ హైస్పీడ్ ఇంటర్నెట్ తో కనెక్ట్ అయ్యాయని పేర్కొన్నారు. పాస్‌పోర్ట్ తనిఖీలో ఏపీ మొదటి స్ధానంలో ఉందన్నారు. 150 జాతీయ అవార్డులు ఏపీ పోలీసులకు వచ్చాయని తెలిపారు.

పోలీసులకు ప్రభుత్వం వీక్లీ ఆఫ్ ఇచ్చిందని వెల్లడించారు. ఇన్సూరెన్స్ కూడా పలు బ్యాంకుల నుంచీ ఏర్పాటు చేశామని తెలిపారు. కోవిడ్ కాలంలో ఏపీ పోలీసుల సేవలు మరువరానివని కొనియాడారు. గంజాయి అణచివేతలో ఏపీ ముందుందన్నారు. 7552 ఎకరాలలో గంజాయి సాగు నాశనం చేశామని పేర్కొన్నారు. 47,988 కేజీల గంజాయి ఇతర రాష్ట్రాల నుంచీ వస్తే సీజ్ చేశామని తెలిపారు.