Village, Ward Secretariat : ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మెరుపు నిరసన

పీఆర్సీ ప్రకటించిన గంటల వ్యవధిలోనే రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మెరుపు నిరసనలకు దిగారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన బాట పట్టారు.

Village, Ward Secretariat : ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మెరుపు నిరసన

Village, Ward Secretariat Employees

Village, Ward Secretariat : ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ పీఆర్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, పీఆర్సీ ప్రకటించిన గంటల వ్యవధిలోనే రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మెరుపు నిరసనలకు దిగారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళనలు చేశారు. దీంతో ఉన్నతాధికారులు చర్చలు జరపనున్నారు. ఇంతకీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు ఏంటి? సర్కార్ సానుకూలంగా స్పందిస్తుందా?

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఈ నెల నుంచే తమకు ప్రొబేషన్ ఇచ్చి, పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రూ.15వేల వేతనం తప్ప మిగతా ప్రభుత్వ ఉద్యోగుల్లా డీఏ, హెచ్ఆర్ఏ, హెల్త్ బెనిఫిట్స్ అమలవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా అన్ని రకాల ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు.

Lemon Water : మోతాదుకు మించి నిమ్మరం తీసుకుంటున్నారా?.. అయితే జాగ్రత్త!..

రాష్ట్రం మొత్తం లక్షా 34వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. గతేడాది అక్టోబర్ రెండో తేదీకే వీళ్లందరి ప్రొబేషన్ పీరియడ్ పూర్తైంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రొబేషన్ కన్ ఫర్మ్ చేసి తమను రెగులర్ ఉద్యోగులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా, పీఆర్సీ ప్రకటించిన సమయంలోనే ఈ ఏడాది జూన్ నెలాఖరులోగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేసి కన్ ఫర్మేషన్ ఇస్తామని, పెంచిన జీతాలు కూడా అప్పటినుంచే అమలు చేస్తామని సీఎం జగన్ చెప్పారు. అయితే, అప్పటివరకు ఆగితే తామంతా చాలా నష్టపోతామని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వాపోయారు. అంతేకాదు ప్రభుత్వ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి కూడా వైదొలిగి తమ నిరసన తెలిపారు. తమ సర్వీస్ ని క్రమబద్దీకరించి పేస్కేల్ ఇవ్వాలని ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు.

Xiaomi 11i Offer: రూ. 867కే Xiaomi 11i స్మార్ట్‌ఫోన్‌ పొందవచ్చు.. ఆఫర్ తెలుసుకోండి!

సోమవారం నుంచి ప్రభుత్వం ఓటీఎస్ మెగా మేళాలు నిర్వహించనుంది. దీంతో నిరసనలను విరమించేలా చూడాలని వార్డు, గ్రామ సచివాలయాల శాఖ సెక్రటరీ అజయ్ జైన్ రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాళ్లంతా ఉద్యోగులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. విధులు బహిష్కరిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పడంతో మెజార్టీ ఉద్యోగులు తిరిగి వాట్సాప్ గ్రూపుల్లో చేరారు.

తమ డిమాండ్లపై సీఎంవో ఆఫీసులో ఉన్నతాధికారులను కలిశారు ఉద్యోగ సంఘాల నేతలు. ప్రొబేషన్ ఖరారు, సర్వీసు క్రమబద్దీకరణపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీంతో వాళ్లు చర్చలకు ఆహ్వానించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు భయపడాల్సింది ఏమీ లేదని ఉద్యోగ సంఘాల నేతలు భరోసా ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై చర్చించేందుకు సోమవారం విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ మేరకు ఒక్కో ఉద్యోగ సంఘం నుంచి ఇద్దరు ప్రతినిధులను ఆహ్వానించారు.