Kodali Nani On Casino : దమ్ముంటే.. ఈడీతో నన్ను అరెస్ట్ చేయించండి-కొడాలి నాని సవాల్

క్యాసినో వ్యవహారంపై మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. దమ్ముంటే తనను ఈడీతో అరెస్ట్ చేయించాలన్నారు. క్యాసినో పై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నివేదికను ఈడీకి ఇవ్వాలన్నారు కొడాలి నాని. దేశంలో ఏం జరిగినా తనకు, జగన్ కు ముడి పెడుతున్నారని ఫైర్ అయ్యారు కొడాలి నాని. చికోటి ప్రవీణ్ వ్యవహారాన్ని తమకు ఆపాదించడం సరికాదంటూ హెచ్చరించారు. (Kodali Nani On Casino)

Kodali Nani On Casino : దమ్ముంటే.. ఈడీతో నన్ను అరెస్ట్ చేయించండి-కొడాలి నాని సవాల్

Kodali Nani On Casino

Kodali Nani On Casino : క్యాసినో వ్యవహారంపై మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. దమ్ముంటే తనను ఈడీతో అరెస్ట్ చేయించాలన్నారు. క్యాసినో పై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నివేదికను ఈడీకి ఇవ్వాలన్నారు కొడాలి నాని. దేశంలో ఏం జరిగినా తనకు, జగన్ కు ముడి పెడుతున్నారని ఫైర్ అయ్యారు కొడాలి నాని. చికోటి ప్రవీణ్ వ్యవహారాన్ని తమకు ఆపాదించడం సరికాదంటూ హెచ్చరించారు.

క్యాసినో డాన్ చికోటి వ్యవహారాన్ని మాపై ఆపాదించడం సరికాదు. టీడీపీ నేతలకు దమ్ముంటే నన్ను ఈడీతో అరెస్ట్‌ చేయించాలి. గుడివాడిలో జూదం అంటూ వచ్చిన టీడీపీ నిజనిర్థారణ కమిటీ నివేదిక ఈడీకి ఇవ్వాలి. దేశంలో ఏం జరిగినా.. చంద్రబాబు భజన బృందం మాకు ముడిపెట్టడం సరికాదు అని కొడాలి నాని అన్నారు.

Casino Chikoti Praveen : చికోటి ప్రవీణ్‌..అలియాస్‌ క్యాసినో ప్రవీణ్‌..ఇది పేరే కాదు ఇట్స్ ఏ బ్రాండ్

క్యాసినో డాన్ చికోటి ప్రవీణ్‌తో అధికార వైసీపీ నేతలకు చీకటి సంబంధం ఉందంటూ.. టీడీపీ నేతలు చేసిన ఆరోపణలపై కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. దేశంలో ఏం జరిగినా వైసీపీకి అంటగట్టడం కరెక్ట్ కాదన్నారు. గుడివాడలో క్యాసినో జరిగిందంటూ.. రోజుల తరబడి టీడీపీ నేతలు ప్రచారం చేశారన్న నాని.. ఆ అంశంపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నివేదికను ఈడీకి సమర్పించాలని డిమాండ్ చేశారు. బోడి గుండుకు మోకాలికి ముడి పెట్టేలా, చికోటిపై ఈడీ తనిఖీలను టీడీపీ బ్యాచ్ తమకు ఆపాదిస్తోందన్నారు.

కొడాలి నాని గుడివాడలో క్యాసినో నిర్వహించి.. జనాలను నిలువుదోపిడీ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. క్యాసినోకు ఎంట్రీ ఫీజుగా రూ.10 వేలు వసూలు చేశారని.. 18వేల మంది ఇందులో పాల్గొనడంతో.. ఎంట్రీ ఫీజు రూపంలోనే రూ.180 కోట్లు ఆర్జించారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. క్యాసినో ద్వారా నిలువు దోపిడీ జరిగిందన్నారు. ఈ డబ్బంతా కొడాలి, ఆయన సన్నిహితులకు వెళ్లిందన్నారు. తాడేపల్లి ప్యాలెస్, వైసీపీ నేతల్లో ఈడీ సోదాలు జరపాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

Casino Chikoti praveen : క్యాసినో చికోటి ప్రవీణ్‌ కేసు..మాధవరెడ్డి కారుపై మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్..!

చికోటి ప్రవీణ్ గురించి తాము అప్పుడే చెప్పామని.. ఎమ్మెల్యే కొడాలి నానికి ప్రవీణ్ తో సాన్నిహిత్యం ఉందని, దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని టీడీపీ నేతలు చెప్పారు. గుడివాడ క్యాసినోకు కేరళ నుంచి కూడా చాలామంది పెద్దవాళ్లు వచ్చారని, ఇక్కడ గేమ్ జరిగిన విధానం చూసి.. వాళ్లంతా ఈడీకి ఫిర్యాదు చేశారని అన్నారు.

ఈడీ అధికారుల సోదా విషయమై చికోటి ప్రవీణ్‌ స్పందించాడు. క్యాసినో విషయంలోనే ఈడీ అధికారులు సోదాలు చేశారని క్లారిటీ ఇచ్చాడు. మన దేశంలోని గోవాతో పాటు నేపాల్, ఇండోనేషియాల్లో క్యాసినో చట్టబద్ధమేనని తెలిపాడు. తాను చేసింది చట్టబద్ధమైన వ్యాపారమేనన్నాడు. ఈడీ అధికారులకు కొన్ని సందేహాలు ఉండటంతో వివరణ అడిగారని వెల్లడించాడు.

క్యాసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్‌ కుమార్‌‌కు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం ప్రవీణ్‌తో పాటు మాధవరెడ్డి తదితర ఏజెంట్లపై ఈడీ ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పలు కీలక ఆధారాలు కూడా సేకరించింది. ఫారిన్ ఎక్స్ చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా)ను ఉల్లంఘనలపై దృష్టి సారించిన ఈడీ.. హవాలా లావాదేవీలకు సంబంధించి విచారణ సాగిస్తోంది. క్యాసినో ముసుగులో చికోటి ప్రవీణ్ పెద్ద దందానే సాగించినట్టుగా తెలుస్తోంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

చికోటి ప్రవీణ్ కు బిగ్ షాట్స్‌తో పరిచయాలు ఉన్నాయని.. దాదాపు 200 మంది కస్టమర్లు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఆ కస్టమర్ల లిస్టులో కొందరు ఎమ్మెల్యేల, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నట్టుగా తెలుస్తోంది. నేపాల్‌కు వెళ్లిన కస్టమర్లలో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం. ప్రవీణ్.. చెన్నై బంగారం వ్యాపారికి హవాలా ఏజెంట్‌గా ఉన్నాడు. చికోటి ప్రవీణ్ చేతిలోనే నలుగురు వాహలా ఆపరేటర్లు ఉన్నారు. బేగంబజార్, బోయిన్‌పల్లి, సరూర్‌ నగర్, జగదీష్ మార్కెట్ కేంద్రంగా వాహలా దందా సాగించాడు. ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్‌, దుబాయ్‌లలో చికోటి ప్రవీణ్ క్యాసినో దందాలు నిర్వహించేవాడు. కస్టమర్ల నుంచి ఒక్కో దేశానికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నాడు. ప్యాకేజీలో.. ప్రతి జూదగాడు విమాన ఛార్జీలు, ఆహారం, హోటల్ బస, పానీయాలు, వినోదం కోసం రూ. 3 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక, కొన్ని సందర్బాల్లో అతడు ప్రత్యేక విమానాలు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.