YS Viveka Case: ఏపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

YS Viveka Case: వైఎస్ వివేకానంద రెడ్డి మృతి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అవినాశ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ వాదనలు ముగిశాయి.

YS Viveka Case: ఏపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

YS Viveka Case

Updated On : April 18, 2023 / 5:28 PM IST

YS Viveka Case: వైఎస్ వివేకానంద రెడ్డి మృతి కేసులో ఏపీ నేత, వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అవినాశ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ వాదనలు ముగిశాయి. అనంతరం హైకోర్టు తీర్పు వెల్లడించింది.

అవినాశ్‌ను ఈ నెల 25 వరకు అరెస్ట్‌ చేయొద్దని సీబీఐని ఆదేశించింది. అదే రోజున అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తుది తీర్పును వెల్లడిస్తామని పేర్కొంది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, సీబీఐ విచారణకు సహకరించాలని అవినాశ్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది.

అవినాశ్ రెడ్డిని రేపు విచారిస్తామని సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. రేపు ఉదయం 10.30 గంటలకు ఆయనను రమ్మంటామని వివరించారు. ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డితో కలిపి అవినాశ్ రెడ్డిని విచారిస్తామని సీబీఐ తెలిపింది.

మరోవైపు, ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని ఆరు రోజులపాటు సీబీఐ కస్టడీలోకి తీసుకునేందుకు సీబీఐ అనుమతి ఇచ్చింది. దీంతో రేపు వారిని సీబీఐ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. అవినాశ్ రేపటి నుంచి ఈ నెల 25 వరకు ప్రతిరోజు విచారణకు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను రికార్డు చేయాలని సీబీఐ అధికారులకు చెప్పింది.

కాగా, అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు జడ్జి ఇప్పటికే 14 రోజుల రిమాండ్ విధించారు. చంచల్ గూడ జైలులో వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నారు. భాస్కర్ రెడ్డి అరెస్ట్‌తో రెండు రోజుల క్రితమే ఎంపీ అవినాశ్‌రెడ్డి హైదరాబాద్‌కు వచ్చారు. ఏపీలో వైఎస్ వివేక కేసు విచారణ జరుగుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసు మొదటి నుంచి ఎన్నో మలుపుతూ తిరుగుతూ వచ్చింది.

YS viveka case : అవినాశ్‌రెడ్డికి బెయిల్ ఇవ్వటానికి వీల్లేదు, సాక్ష్యాధారాలు తారుమారు చేసినట్లు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి.. : సీబీఐ