AP Medical Team : బెంగళూరు ఎయిర్ పోర్టులో ఏపీ ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు.. అనుమతించని సెక్యూరిటీ అధికారులు

బెంగళూరు విమానాశ్రయంలో ప్రత్యేక వైద్య బృందాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించింది. విమానాశ్రయంలోకి ఏపీ వైద్య సిబ్బందిని సెక్యూరిటి డిపార్ట్ మెంట్ అధికారులు అనుమతించలేదు.

AP Medical Team : బెంగళూరు ఎయిర్ పోర్టులో ఏపీ ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు.. అనుమతించని సెక్యూరిటీ అధికారులు

Bangalore Airport (1)

Bangalore airport Security refused : కర్ణాటక రాజదాని బెంగళూరు విమానాశ్రయంలో ప్రత్యేక వైద్య బృందాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించింది. బెంగళూరు నుంచి ఏపీ బార్డర్ అనంతపురము జిల్లాకు ఎక్కువ మంది వస్తుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్ కేసులు బెంగళూరులో బయట పడటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

విదేశాల నుంచి ఏపీకి వచ్చేవారికి బెంగళూరు విమానాశ్రయంలోనే అనంతపురము జిల్లా వైద్య సిబ్బంది టెస్టింగ్ స్క్యానింగ్ చేయాలనుకుంది. ప్రతి ఒక్కరిని క్షుణ్నంగా పరిశీలించాలనుంది. ఎవరికైనా ఒమిక్రాన్, కరోనా లక్షణాలు బయటపడితే.. వారిని అక్కడే క్వారెంటైన్ కు తరలించి ఏపీ వైద్యులు చికిత్స అందింస్తున్నారు.

CM KCR : రోశయ్య పార్థివదేహానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్

బెంగళూరు విమానాశ్రయంలోకి ఏపీ వైద్య సిబ్బందిని సెక్యూరిటి డిపార్ట్ మెంట్ అధికారులు అనుమతించలేదు. తమకు కర్ణాటక వైద్య శాఖ నుంచి పర్మీషన్ లేదని.. ఒక వేళ కర్ణాటక వైద్య శాఖ నుంచి పర్మీషన్ తీసుకుకొస్తే అప్పుడు విమానాశ్రయంలోకి అనుమతి ఇస్తామని తెలిపింది. దీంతో ఉదయం నుంచి అనంతపురము జిల్లా వైద్య సిబ్బంది విమానాశ్రయం బయటే వెయిట్ చేస్తోంది. ఈ విషయాన్ని అనంతపురము వైద్య సిబ్బంది ఏపీ వైద్యశాఖ అధికారులకు తెలియజేసింది.

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కలవరపెడుతుండగా.. ఏపీలోనూ టెన్షన్‌ పుట్టిస్తోంది. విశాఖలో దక్షిణాది రాష్ట్రాల ఇండియా స్కిల్‌ పోటీలు జరుగుతుండగా.. ఐదు రాష్ట్రాలకు చెందిన 8వందల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. అయితే ఇందులో ఆరుగురుకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో 50 మందికి కరోనా లక్షణాలు ఉండటంలో ఒక్కసారిగా కలవరం మొదలైంది.

Pawan Kalyan Mourned : రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు : పవన్ కళ్యాణ్

మరోవైపు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు మిస్సింగ్ అయ్యారని వస్తున్న కథనాలను ఏపీ వైద్యఆరోగ్య శాఖ ఖండించింది. ఈ మధ్యకాలంలో విశాఖ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు విదేశాల నుంచి 30 మంది ప్రయాణికులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం ఇచ్చింది.

30 మంది విదేశీ ప్రయాణికులు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు డైరెక్టర్ ఆఫ్‌ హెల్త్ తెలిపింది. కోవిడ్ నిబంధనల్లో భాగంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.