Tipu Sultan : కడప జిల్లాలో టిప్పుసుల్తాన్ విగ్రహం.. వైసీపీ ఎమ్మెల్యేపై బీజేపీ నేత ఆగ్రహం

కడప జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చరిత్ర తెలుసుకోకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Tipu Sultan : కడప జిల్లాలో టిప్పుసుల్తాన్ విగ్రహం.. వైసీపీ ఎమ్మెల్యేపై బీజేపీ నేత ఆగ్రహం

Tipu Sultan

Tipu Sultan : కడప జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చరిత్ర తెలుసుకోకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ప్రొద్దుటూరులోని జిన్నా రోడ్డులో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేస్తే తాము ఊరుకోమని విష్ణువర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. టిప్పుసుల్తాన్ విగ్రహంతోనే మీ పతనం మొదలవుతుందంటూ వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. ఇప్పుడు టిప్పు సుల్తాన్‌ విగ్రహం పెట్టి రేపు అఫ్జల్ గురు విగ్రహం పెట్టేందుకు కూడా సిద్దమవుతారంటూ ధ్వజమెత్తారు. వైసీపీ సర్కార్‌కు టిప్పుసుల్తాన్‌, కసబ్, అప్ఘల్ గురు వంటి వారు దేశభక్తుల్లా కనిపిస్తున్నారని విష్ణు విమర్శించారు.
వీరి చరిత్ర పాఠ్యాంశాలలో చేర్చాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ప్రొద్దుటూరులో ఎలాంటి అనుమతుల్లేకుండా టిప్పుసుల్తాన్ విగ్రహం పెడుతున్నారని విష్ణు ఆరోపించారు. జిన్నారోడ్డు సర్కిల్ లో చరిత్రపై చర్చకు ఎమ్మెల్యే రాచమల్లు సిద్దమా అని విష్ణు ప్రశ్నించారు. జిన్నారోడ్డు దగ్గర జిన్నా పేరు తొలగించాలని డిమాండ్ చేశారు. టిప్పుసుల్తాన్‌ విగ్రహం ఏర్పాటు వెనుక తప్పకుండా కుట్ర కోణం ఉందన్నారు.

”దేశద్రోహుల విగ్రహాలు పెడితే రాళ్లతో కొడతారు. వైసీపీ నేతలకు కసబ్, అఫ్జల్ గురు, టిప్పు సుల్తాన్ చరిత్రలు మాత్రమే తెలుస్తాయి.. రాష్ట్రంలో అనేకమంది కవులు, కళాకారులు, చరిత్రకారులు ఉన్నారు. అన్నమయ్య, సత్యసాయిబాబా, వేంకటేశ్వరస్వామి.. ఇంతమంది చరిత్రకారులు పుట్టిన రాయలసీమగడ్డలో వైసీపీ ప్రభుత్వం ఒక్క చరిత్రకారుడి పేరుతో పథకం పెట్టలేదు. దేశ ద్రోహుల విగ్రహాలు పెడితే చూస్తూ ఊరుకునేది లేదు” అని బీజేపీ నేత విష్ణు హెచ్చరించారు.

టిప్పుసుల్తాన్ విగ్రహం విషయంలో బీజేపీ వైఖరిని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి తప్పుబట్టారు. టిప్పుసుల్తాన్‌ స్వాతంత్ర సమరయోధుడేనని, జాతీయవాదంతో టిప్పు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు. బ్రిటిష్‌ చరిత్ర కారులు రాసిన చరిత్ర చదివి రాద్ధాంతం చేయొద్దని బీజేపీ నేతలకు సూచించారు. ప్రొద్దుటూరు ప్రజలు టిప్పుసుల్తాన్‌ గురించి తెలుసుకోవాలని ఆయన అన్నారు. బీజేపీ నేతలు మతసామరస్యానికి భంగం కలిగించొద్దని సూచించారు. శాస్త్ర్రీయ ఆధారాలు ఉంటే బీజేపీ నేతలు నిరూపించాలని, తాను అంత మేథావిని కాదని, ప్రొద్దుటూరులో మేథావులతో చర్చ పెట్టి టిప్పుసుల్తాన్‌ స్వాతంత్ర సమరయోధుడు కాదని నిరూపిస్తే ఒప్పుకుంటానని తెలిపారు.

సీఎం జగన్ సొంత జిల్లా కడపలో టిప్పుసుల్తాన్‌ విగ్రహం వివాదం ముదురుతోంది. ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్‌ విగ్రహ ఏర్పాటు కోసం వైసీపీ నేతలు, స్ధానిక ముస్లింలు ప్రయత్నిస్తుండగా.. దీన్ని అడ్డుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. నిన్న విగ్రహ ఏర్పాటుపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఇవాళ విష్ణువర్ధన్‌రెడ్డి ఏకంగా విగ్రహం సందర్శనకు వెళ్లడం వివాదాన్ని మరింత పెంచింది.