BJP: టీడీపీతో పొత్తు అంటూ పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనపై బీజేపీ స్పందన

ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారని పేర్కొంది.

BJP: టీడీపీతో పొత్తు అంటూ పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనపై బీజేపీ స్పందన

BJP - Pawan kalyan

Updated On : September 14, 2023 / 4:04 PM IST

BJP – Pawan kalyan: వచ్చే ఎన్నికల్లో జనసేన (JanaSena), టీడీపీ (TDP) కలిసే పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయంపై బీజేపీ స్పందించింది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

విజయవాడ నుంచి ఏపీ బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారని పేర్కొంది. తమ పార్టీకి సంబంధించి పొత్తుల అంశం బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని తెలిపింది.

తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంపై కేంద్ర నాయకత్వం స్పష్టత ఇస్తుందని పేర్కొంది. ఎన్నికల్లో పొత్తుల విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయిస్తారని తెలిపింది. ఏపీలో ప్రస్తుతానికైతే జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతోందని పేర్కొంది.

కాగా, మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగాల్సి ఉంది. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఊహించినదాని కంటే ముందుగానే ఏపీలో ఎన్నికలు జరుగుతాయి. టీడీపీతో కలిసి పోటీ చేయడానికి బీజేపీ ఆసక్తి చూపడం లేదు.

Pawan Kalyan: చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి పవన్ కల్యాణ్ పరామర్శ