Borewell Pipe : నిన్న వాటర్ ట్యాంక్.. నేడు బోరు పైపు.. చిత్తూరు జిల్లాలో మరో వింత.. భూమి నుంచి బయటకు

భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో వింతలు చోటు చేసుకున్నాయి. ఇటీవల తిరుపతిలోని శ్రీకృష్ణా నగర్‌లో ఓ ఇంట్లో 25 అడుగుల వాటర్‌ ట్యాంక్‌ భూమిలో నుంచి ఒక్కసారిగా పైకి రావడం అందరినీ..

Borewell Pipe : నిన్న వాటర్ ట్యాంక్.. నేడు బోరు పైపు.. చిత్తూరు జిల్లాలో మరో వింత.. భూమి నుంచి బయటకు

Borewell Pipe

Borewell Pipe : భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో వింతలు చోటు చేసుకున్నాయి. ఇటీవల తిరుపతిలోని శ్రీకృష్ణా నగర్‌లో ఓ ఇంట్లో 25 అడుగుల వాటర్‌ ట్యాంక్‌ భూమిలో నుంచి ఒక్కసారిగా పైకి రావడం అందరినీ విస్మయానికి గురి చేసింది. 18 సిమెంట్ ఒరలతో ఉన్న ఆ వాటర్‌ ట్యాంక్‌ భూమి లోపల నుంచి పైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇది మరువక ముందే చిత్తూరు జిల్లాలో మరో వింత చోటు చేసుకుంది.

Indians : గూగుల్ నుంచి ట్విట్టర్ వరకు అంతా మనోళ్లే..!

30 అడుగుల బోరు పైపు భూమిలో నుంచి బయటకు వచ్చింది. నిండ్ర మండలం కచ్ఛరవేడు గ్రామంలో ఈ ఘటన జరిగింది. దొరస్వామి అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం తన పొలంలో 30 అడుగుల లోతులో బోరు వేయించాడు. నీళ్లు రాకపోవడంతో పైపులను అలానే భూమిలో వదిలేశాడు. కాగా, భారీగా కురిసిన వర్షాలకు, పెరిగిన భూగర్భ జలాల మట్టంతో.. 30 అడుగుల బోరు పైపు పైకి వచ్చింది. ఏకంగా భూమిలో నుంచి బయటకు వచ్చి నిటారుగా నిలబడింది. దీన్ని స్థానికులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ వింతను చూసేందుకు క్యూ కట్టారు.

కొన్ని రోజులుగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి నగరం నీట మునిగింది. ఇక తిరుపతిలోని ఎం.ఆర్ పల్లిలో ఎవరూ, ఎన్నడూ చూడని అరుదైన వింత చోటు చేసుకుంది. స్థానిక శ్రీకృష్ణా నగర్‌లో ఓ మహిళ తన ఇంట్లోని 25 అడుగుల వాటర్‌ ట్యాంక్‌ని శుభ్రం చేస్తుండగా, షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

వాటర్ ట్యాంక్ భూమి నుంచి పైకి రావడం మొదలైంది. దీంతో ఆ మహిళ ఒక్కసారిగా బిత్తరపోయింది. ఏ జరుగుతుందో అర్ధం కాక కేకలు వేయడం ప్రారంభించింది. భార్య కేకలు విని ఇంట్లో ఉన్న భర్త బయటకు పరుగులు పెట్టుకుంటూ వచ్చాడు. జరుగుతున్న ఘటన చూసి అవాక్కయ్యాడు. ఆ షాక్ నుంచి వెంటనే తేరుకొని నిచ్చెన సాయంతో భార్యను బయటకు తీసుకొచ్చాడు. ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.

18 ఒరలతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ 11 ఒరల మేర బయటకు వచ్చింది. భూమిలో నుంచి నిటారుగా బయటకు వచ్చిన వాటర్ ట్యాంక్ ను చూసేందుకు చుట్టుపక్కల జనం భారీగా తరలివచ్చారు.

కాగా, భూమి పొరల్లో మార్పు, సంప్ నిర్మాణ సమయంలో నింపిన ఇసుక, కాలువ గట్టున ఉన్న ప్రాంతం కావడం, వరద ముంపు.. ఈ అంశాల కారణంగానే సంపు భూమి నుంచి పైకి లేచిందని జియాలజీ ప్రొఫెసర్లు తెలిపారు. భయపడాల్సిన పని లేదని, ఇది భూమిలో జరిగే సహజమైన పరిణామమేనని వివరించారు. ఇది మరువక ముందే.. ఇప్పుడు మరో వింత వెలుగుచూసింది.