పెళ్లికి గంట ముందు ఊహించని షాక్ ఇచ్చిన వధువు

10TV Telugu News

bride marraige: కాసేపట్లో పెళ్లి. అంతా సిద్ధం చేశారు. బంధువులు అంతా తరలి వచ్చారు. మరి గంటలో పెళ్లి. వధువు మెడలో వరుడు తాళి కట్టాల్సి ఉంది. ఇంతలో వధువు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తల్లిదండ్రులకు, అబ్బాయి తరఫు వారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని ప్రియుడి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది వధువు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల ఎంట్రీతో పెళ్లి ఆగిపోయింది. పోలీసులు వధువుని విచారించారు. తనకు బలవంతపు పెళ్లి చేస్తున్నారని వధువు పోలీసులతో చెప్పింది. దీంతో వేదికపైనే పెళ్లి ఆగిపోయింది. తహశీల్దార్ సమక్షంలో వధువును చెన్నై పంపారు అధికారులు.

చిత్తూరు జిల్లా పీలేరు మండలం గుర్రంకొండలో ఈ ఘటన జరిగింది. వధువు ఇచ్చిన షాక్ తో అటు తల్లిదండ్రులు, ఇటు వరుడు, అతడి తల్లిదండ్రులు, బంధువులు అంతా షాక్ అయ్యారు. పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చు కదా అని వరుడి తల్లిదండ్రులు అంటున్నారు. ఇక్కడి దాకా వచ్చాక ఇలా చేయడం ఏమీ బాగోలేదని వాపోయారు. ఇంకా నయం పెళ్లయ్యాక ఇలాంటి పని చేసి ఉంటే, ఊహించుకోవడమే చాలా కష్టంగా ఉందంటున్నారు.
https://10tv.in/marriage-between-first-cousins-illegal-punjab-and-haryana-hc/
వధువుది కడప జిల్లా. గుర్రంకొండకు చెందిన వ్యక్తితో నిన్న(నవంబర్ 20,2020) అర్థరాత్రి వివాహం జరగాల్సి ఉంది. కళ్యాణ మండపంలో పెళ్లి తంతు ప్రారంభం అయ్యింది. ఇంతలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసుల ఎంట్రీతో పెళ్లి ఆగిపోయింది.

10TV Telugu News