Monkey: కుక్కల దాడిలో గాయపడ్డ కోతి.. చికిత్స చేస్తుండగా బయటపడ్డ బుల్లెట్

కుక్కల దాడిలో ఓ కోతికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స కోసం వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు కోతికి చికిత్స నిర్వహిస్తున్న క్రమంలో కోతి కడుపులో బుల్లెట్ చూసి కంగుతిన్నారు.

Monkey: కుక్కల దాడిలో గాయపడ్డ కోతి.. చికిత్స చేస్తుండగా బయటపడ్డ బుల్లెట్

Monkey (1)

Monkey: కుక్కల దాడిలో ఓ కోతికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స కోసం వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు కోతికి చికిత్స నిర్వహిస్తున్న క్రమంలో కోతి కడుపులో బుల్లెట్ చూసి కంగుతిన్నారు. ఈ ఘటన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చోటు చేసుకుంది. కోతి కడుపులోకి బుల్లెట్ ఎలా వచ్చిందనే అంశం ఇప్పుడు ఆ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Haryana: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రైలు ఢీకొని బీఎస్ఎఫ్ జవాన్ మృతి..

ఈ విషయంపై వైద్యుడు తేజస్ మాట్లాడుతూ.. ఉండి మండలం చెరుకువాడ గ్రామంకు చెందిన కోతి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడటంతో స్థానికులు భీమవరంలోని వెటర్నరీ ఆస్పత్రికి తీసుకొచ్చారని తెలిపాడు. అయితే తాము కోతికి చికిత్స చేస్తున్న క్రమంలో దాని పొట్టభాగంలో బుల్లెట్ ను గుర్తించామని అన్నారు.

Monkey

ఆ బుల్లెట్ ను బయటకుతీసి చికిత్స అనంతరం కోతికి కట్లు వేయడం జరిగిందని వైద్యుడు తేజస్ తెలిపాడు. అయితే కోతి శరీరంలోకి అసలు బల్లెట్ ఎలా వెళ్లింది, ఎవరు తుపాకితో కాల్చారు అనే విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.