Caravan Tourism: పర్యాటకుల కోసం కారవాన్ టూరిజం.. ఏపీలో 15 టూరిస్ట్ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు..
విదేశాల్లో బాగా పాపులర్ అయిన కారవాన్ టూరిజం అందుబాటులోకి రానుంది. ఇటీవలే దీనిని కేరళలో ప్రారంభించారు.

caravan tourism pilot project in andhra pradesh
Caravan Tourism – Andhra Pradesh: ప్రకృతి పరవశానికి మారుపేరు తూర్పు కనుమలు. ఎత్తైన కొండలు, దట్టమైన అటవీ.. స్వచ్ఛమైన గాలి.. మనసుకు ఆస్వాదం కలిగించే వాగులు వంకలు, సేలయేళ్లు. వర్ణనలకు అందని ప్రకృతి అందం ఈ అటవీ సొంతం. విదేశాలతో పోటీపడే వ్యూపాయింట్స్ (view point) ప్రకృతి అందాలకు పెట్టింది పేరుగా నిలుస్తోంది అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitharama Raju district). మారేడుమిల్లి (Maredumilli), లంబసింగి (lambasingi), వంజంగి, అరకు (araku), మాడగడ వంటి ప్రాంతాలకు టూరిస్టుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాలే (Telugu States) నుంచే కాకుండా.. తమిళనాడు, ఒడిషా, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా ఉంటోంది.
దట్టమైన అటవీ.. పచ్చతివారీ పరిచినట్లు కొండ మధ్యలో మైదానం. మనసుకు ఆహ్లాదం పంచే వాతావరణం అల్లూరి మన్యంలో కనిపిస్తోంది. పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు పర్యాటకశాఖ ప్రత్యేక ప్యాకేజీలు రూపొందిస్తోంది. విదేశాల్లో బాగా పాపులర్ అయిన కారవాన్ టూరిజం అందుబాటులోకి రానుంది. ఇటీవలే దీనిని కేరళలో ప్రారంభించారు. ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో కారవాన్‌లోనే వంట చేసుకుని, అందులోనే రాత్రి బస చేసే అవకాశం ఉంటుంది. ట్రాన్స్ పోర్ట్, వ్యుపాయింట్ దగ్గర స్టే వంటి సౌకర్యం ఇందులోనే ఉంటుంది.
సీజన్‌లో వెకేషన్‌కు వెళ్ళినప్పుడు హోటల్ రూమ్స్ కోసం వెయిటింగ్, రెస్టారెంట్‌లో ఫుడ్ ఎలా ఉంటుందోనన్న సందేహాలు అందరికి వచ్చేవే. వాటికి చెక్ పెడుతూ.. ఏపీ టూరిజం సిద్ధమైంది. ఆ ప్రత్యామ్నాయమే కారవాన్ టూరిజం. దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్న కారావాన్ టూరిజం వైపు అడుగులు వేస్తోంది. పర్యాటకుల ఆదరణ ఉన్న మొత్తం 15 ప్రాంతాల్లో దీనిని అందుబాటులోకి తేనుంది. మూడు రకాల కారవాన్ టూరిజంను పర్యాటకులకు పరిచయం చేసేందుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి.
కారవాన్ టూరిజంలో అన్ని వసతులు అందులోనే ఉంటాయి. ప్రయాణం, ఆహారం, విశ్రాంతి అన్ని అందులోనే. ఈ వాహనంలో పడకగది, వంటగది, మంచినీటి నిల్వ ఉంటుంది. వాహనంలో ఆడియో, వీడియో సౌకర్యం వంటివి ఉంటాయి. ఏపీలో ప్రధాన పర్యాటక ప్రాంతలైన విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, గండికోట తదితర 15 చోట్ల దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని చూస్తున్నారు. విశాఖలో పైలట్ కింద ఎంపిక చేసిన మూడు ప్రాంతాల్లో మూడు భిన్నమైన టూరిజం స్పాట్స్ లో దీనిని అందుబాటులోకి తేనున్నారు. అదే జరిగితే పర్యాటకులు.. మరింత ఆనందంగా పృకృతిని ఎంజాయ్ చేయోచ్చు.
Also Read: సముద్ర విహారం.. రూ.96 కోట్లతో విశాఖపట్నంలో క్రూయిజ్ టెర్మినల్
అరకు, లంబసింగి, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో కారవాన్‌ను పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించాలని చూస్తున్నారు. పైన్ చెట్లు అధికంగా ఉన్న అనంతగిరికి 35 కిలోమీటర్ల దూరంలోని అంజోడాలో ఫారెస్ట్ కారవాన్, డల్లాపల్లిలో హిల్‌స్టేషన్ కారవాన్, ఎర్రమట్టి దిబ్బలు ఎదురుగా బీచ్ కారవాన్‌ను పైలట్‌గా ప్రారంభించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు ప్రభుత్వం ఎంపిక చేసిన కన్సల్టెన్సీ సన్నాహలు ప్రారంభించింది. లగ్జరీ వాహనాలు కాకుండా, సాధారణ వాహనాలను లగ్జరీగా డిజైన్ చేయబోతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకుల ఆదరణ ఉన్న మొత్తం 15 ప్రాంతాల్లో ఈ కారావాన్ టూరిజం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ 15 ప్రాంతాల్లో విశాఖ జిల్లాలో మూడు ప్రాంతాలను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. మూడు రకాల కారవాన్ టూరిజంను పర్యాటకులకు పరిచయం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, గండికోట తదితర 15 చోట్ల దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని ప్లాన్. అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని అంజోడా ఫారెస్ట్ ప్రస్తుతం సరికొత్త ఏజెన్సీ డెస్టినేషన్. ఇక్కడ కారవాన్ టూరిజంను పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదే అల్లూరి జిల్లాలోని డల్లాపల్లి హిల్‌స్టేషన్ లో కూడా కారవాన్ టూరిజం ఏర్పాటు చేయనున్నారు.