చంద్రబాబు, లోకేష్‌లపై నందిగామలో కేసు నమోదు

  • Published By: vamsi ,Published On : June 1, 2020 / 01:22 AM IST
చంద్రబాబు, లోకేష్‌లపై నందిగామలో కేసు నమోదు

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లపై కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. చంద్రబాబు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించలేదంటూ నందిగామ పోలీసు స్టేషన్‌లో కొందరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.చంద్రబాబు, లోకేశ్‌లు మే 25వ తేదీన హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లారు. ఈ సంధర్భంగా.. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ న్యాయవాది, వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బర్రె శ్రీనివాసరావు ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసినట్టు నందిగామ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ కనకారావు వెల్లడించారు. అలాగే, మరికొందరిపైనా కేసులు నమోదు చేశారు. చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్‌ 188 కింద కేసుల నమోదు చేశారు.

భారీ కాన్వాయ్‌తో ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా జగ్గయ్యపేట, కంచికర్లలో జనసమీకరణకు కారణం అయ్యారంటూ లాయర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక అనుమతితో మే 25న ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు మార్గమధ్యంలో పలుచోట్ల జనసమీకరణ, బైక్‌ ర్యాలీలకు కారణం అయ్యారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. 

Read: మంత్రి శంకర్ నారాయణ ఇంట్లో కరోనా కలకలం