ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను సమర్థించిన క్యాట్

ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్ లో చుక్కెదురైంది. తన సస్పెన్షన్ పై వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్ ను క్యాట్ కొట్టివేసింది.

  • Published By: veegamteam ,Published On : March 17, 2020 / 06:20 AM IST
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను సమర్థించిన క్యాట్

ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్ లో చుక్కెదురైంది. తన సస్పెన్షన్ పై వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్ ను క్యాట్ కొట్టివేసింది.

ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్ లో చుక్కెదురైంది. తన సస్పెన్షన్ పై వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్ ను క్యాట్ కొట్టివేసింది. ప్రభుత్వం వెంకటేశ్వరరావు ను సస్పెండ్ చేయడాన్ని సమర్థించింది. ఆయన సస్పెన్షన్ ను రద్దు చేసేందుకు నిరాకరించింది. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో వెంకటేశ్వరరావు అవినీతి, అక్రమం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆయన్ను సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ కూడా ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను నిర్ధారించింది. దీంతోపాటు ఏసీబీతో ప్రత్యేకంగా దర్యాప్తు చేయించి నిర్ధారించాలని ఆదేశించింది. 

కాగా, ప్రవర్తనా నియమాల్ని ఉల్లంఘించినందుకు ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ నిబంధనల నియమం 3 (1) కింద సస్పెండ్‌ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఏబీ వెంకటేశ్వరరావు అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా ఉండగా భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడినట్లు తేలటంతో సస్పెండ్‌ చేసినట్లు జీవో నంబర్‌ 18లో స్పష్టం చేసింది. పోలీసు ఇంటెలిజెన్స్‌ ప్రొటోకాల్స్‌ విధానాలను సైతం ఆయన ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది.

ఇప్పటికే వెంకటేశ్వరరావు క్యాట్ ను ఆశ్రయించాడు. తనకు జరిగిన అన్యాయం గురించి తెలియజేయడం, 10 నెలలుగా తనకు జీతం ఇవ్వకుండా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని క్యాట్ ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూడు సార్లు దీనిపై క్యాట్ లో దీనిపై విచారణ జరిగింది. ఈక్రమంలో క్యాట్… ఏబీ వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా పూర్తిస్థాయిలో తీర్పు ఇచ్చింది.

ఏపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కూడా క్యాట్ సమర్థించింది. దీంతో ఆయనకు ఉన్న కొద్ది పాటి ఆశలు కూడా లేకుండాపోయాయి. తదుపరి కేంద్ర హోంశాఖ ఆదేశించిన నేపథ్యంలో ఏసీబీ కూడా గతంలో వెంకటేశ్వరరావు చేసిన కొనుగోళ్లు, అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించి ఆస్తులపై కూడా ఏసీబీ విచారించనుంది. 

Also Read | కరోనా ఎఫెక్ట్: బ్యాంకులకు ఎవ్వరినీ రావొద్దన్న SBI