Key Evidence : వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక ఆధారాలు

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో సీబీఐ కీలక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేయడంతో కేసు దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Key Evidence : వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక ఆధారాలు

Ys Viveka

YS Vivekanandareddy murder case : వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో సీబీఐ కీలక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేయడంతో కేసు దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. గతంలో సునీల్‌ యాదవ్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ…నిన్న ఉమాశంకర్‌రెడ్డిని అరెస్ట్ చేసింది. సింహాద్రిపురం మండలం కుంచేకుల గ్రామానికి చెందిన ఉమాశంకర్‌రెడ్డి…వివేకా పొలం పనులు చూసే జగదీశ్వర్‌రెడ్డికి సోదరుడు. రోజంతా ఉమాశంకర్‌రెడ్డిని విచారించిన అధికారులు సాయంత్రం అరెస్ట్‌ చేసి పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 23వరకు రిమాండ్ విధించడంతో…పులివెందుల నుంచి కడప జిల్లా జైలుకు తరలించారు.

రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలను పొందుపర్చింది సీబీఐ.. ఉమాశంకర్‌రెడ్డిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పులివెందుల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. వివేకానందరెడ్డి హత్యకేసులో సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి పాత్రపై ఆధారాలున్నాయంటూ రిమాండ్ రిపోర్ట్‌లో సీబీఐ అధికారులు తెలిపారు… హత్యకేసులో సునీల్, ఉమాశంకర్‌ రెడ్డి కుట్ర కోణం ఉందని పేర్కొన్నారు. హత్యకేసులో ఉమాశంకర్‌ పాత్ర ఉందంటూ విచారణ సమయంలో సునీల్ చెప్పినట్లు, అలాగే వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలోనూ ఉమాశంకర్‌ పాత్ర ఉన్నట్లు ప్రస్తావించారు.

వివేకా హత్యకు ముందు ఆయన ఇంట్లో కుక్కను చంపారని రిమాండ్ రిపోర్ట్‌లో సీబీఐ పేర్కొంది. సునీల్, ఉమాశంకర్‌ కలిసి కారుతో ఢీకొట్టి కుక్కను చంపారని, వివేకాను హత్యచేశాక ఉమాశంకర్ బైక్‌లో గొడ్డలి పెట్టుకుని పారిపోయాడని, ఆ గొడ్డలితో పాటు బైక్‌ను సీజ్‌ చేసినట్లు సీబీఐ రిమాండ్ రిపోర్టులో తెలిపింది..

వివేకా హత్యకేసులో గుజరాత్‌ నుంచి ఫోరెన్సిక్‌ నివేదిక తెప్పించిన సీబీఐ.. గతనెల 11న ఉమాశంకర్‌ ఇంట్లో రెండు చొక్కాలు స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో మరి కొందరు నిందితులను పట్టుకోవాల్సి ఉందని… ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తెలిపింది… ఉమాశంకర్‌రెడ్డిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్‌లో పేర్కొంది సీబీఐ.. సీబీఐ దూకుడు చూస్తుంటే త్వరలోనే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది..