YS Viveka Case : దర్యాప్తు మా పద్ధతిలోనే చేస్తాం..అవినాశ్ రెడ్డి కోరుకున్నట్లుగా కాదు : సీబీఐ

కావాలనే విచారణకు హాజరు కాకుండా సాకులు చెబుతున్నారని నోటీసులు ఇచ్చిన ప్రతీ సారీ ఏదోక కారణం చెప్పి హాజరుకావటంలేదని..దర్యాప్తు జాప్యం చేయటం కోసమే అవినాశ్ అలా చేస్తున్నారని సీబీఐ ఆరోపించింది.

YS Viveka Case : దర్యాప్తు మా పద్ధతిలోనే చేస్తాం..అవినాశ్ రెడ్డి కోరుకున్నట్లుగా  కాదు : సీబీఐ

YS Viveka cas YS Avinash reddy

YS Viveka Case CBI : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. దీంట్లో భాగంగా కోర్టు ముందు సీబీఐ పలు కీలక అంశాలను వెల్లడించింది. దర్యాప్తులో అవినాశ్ రెడ్డి మొదటినుంచి ఆటంకాలు సృష్టిస్తున్నారని… దర్యాప్తు మా పద్ధతిలో చేస్తాం అంతేగాని అవినాశ్ కోరుకున్నట్లుగా చేయం అంటూ కోర్టుకు స్పష్టం చేసింది సీబీఐ. ఇన్ని సార్లు విచారణకు హాజరయ్యారని ఆయన చెబుతున్నారు. కానీ విచారణకు అవినాశ్ ఏమాత్రం సహకరించటంలేదని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.

కావాలనే విచారణకు హాజరు కాకుండా సాకులు చెబుతున్నారని నోటీసులు ఇచ్చిన ప్రతీ సారీ ఏదోక కారణం చెప్పి హాజరుకావటంలేదన్నారు .దర్యాప్తు జాప్యం చేసి లబ్ది పొందటం కోసమే అవినాశ్ అలా చేస్తున్నారని తెలిపారు. ఈకేసులో ఎంతోమందిని విచారించాం కొందరిని మాత్రమే అరెస్ట్ చేశాం కానీ ఎవ్వరు ఇలా వ్యవహరించలేదు. అవినాశ్ కుటుంబానికి వివేకాతో రాజకీయ విభేదాలు ఉన్నాయని  తెలిపారు. కోర్టులో పలు పిటిషన్లు వేస్తూ..కావాలనే విచారణలో జాప్యం కలిగేలా వ్యవహరిస్తున్నారని.. విచారణ ఎదుర్కొనవారికి లేని ఇబ్బంది అవినాశ్ రెడ్డికే ఎందుకు? అటువంటి ప్రత్యేక పరిస్థితి అవినాశ్ కు ఏంటీ అని ప్రశ్నించారు. వివేకా హత్యకు నెల రోజులు ముందే కుట్ర జరిగిందని..రాజకీయ కారణాలతోనే ఈ హత్య జరిగిందని సీబీఐ తెలిపింది.

సీబీఐ వాదనలు విన్న కోర్టు సామాన్యుల కేసులో ఇంత సమయం తీసుకుంటారా? అని సీబీఐని ప్రశ్నించింది.లోక్ సభ అభ్యర్థిగా అవినాశ్ ను అనధికారికంగా ముందే ప్రకటించారని స్టేట్ మెంట్లు ముందే చెబుతున్నాయి కదా? అవినాశ్ అభ్యర్థిత్వాన్ని అందరు సమర్ధించినట్లుగా స్టేట్ మెంట్లు ఉన్నాయి కదా అని ప్రశ్నించింది. రాజకీయంగా అవినాశ్ బలవంతుడు అని మీరే అంటున్నారు. అలా అయితే వివేకాను హత్య చేయాల్సి అవసరం అవినావ్ కు ఏంటీ అని సీబీఐను ప్రశ్నించింది కోర్టు.