Special Status for AP : ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై మరోసారి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పార్లమెంట్ సాక్షింగా ఏపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

Special Status for AP : ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Center Govt clarity on special status for AP

Special Status for AP : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కి ప్రత్యేక హోదా(special status)పై మరోసారి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పార్లమెంట్ (parlament)సాక్షింగా ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అని తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 14వ ఆర్థి సంఘం సిఫారసుల మేకు ఇటువంటి నిర్ణయం అని తేల్చి చెప్పింది. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని గుర్తు చేసింది. లోక్ సభ(Lok Sabha)లో వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ (central minister nityanand rai)సమాధానం చెబుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోవడంలేదని ఇది ముగిసిపోయిన అధ్యాయం అని పార్లమెంటులో స్పష్టం చేసింది.

14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకే ఈ నిర్ణయమని..ఆర్థిక లోటు భర్తీకి 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించింది అని వివరించారు మంత్రి. దీంతో ప్రత్యేక రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలకు మధ్య అంతరం తొలగిపోయిందని..హోదాకు బదులుగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించామని కేంద్రం స్పష్టం చేసింది. ప్యాకేజీ కింద నిధులు కూడా విడుదల చేశామని తెలిపింది.

కాగా తమను అధికారాం ఇస్తే..కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తెస్తాం అని వాగ్ధానం చేసిన వైసీపీ మాటల్ని ఏపీ ప్రజలు నమ్మారు.ఓట్లు వేసి భారీ సంఖ్యలో ఎంపీలను గెలిపించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటుతున్నా ప్రత్యేక హోదా తెచ్చింది లేదని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.  పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ నామమాత్రంగా ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించటం కేంద్రం అది ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయం అంటే పదే పదే చెప్పటం పరిపాటిగా మారిపోయింది.ఈ క్రమంలో వైసీపీ తాము ప్రత్యేక హోదా గురించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని చెప్పుకోవటానికి మరోసారి లోక్ సభలో ప్రశ్నించగా కేంద్రం మరోసారి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది.