Central Government : తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీని కేంద్రం అనుకూలంగా మార్చుకుంటోందా?

ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న నీటి పంచాయతీని కేంద్రం తనకు అనుకూలంగా మార్చుకుంటోందా..? తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నియంత్రణ, నిర్వహణను తన గుప్పిట్లో పెట్టుకోనుందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది.

Central Government : తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీని కేంద్రం అనుకూలంగా మార్చుకుంటోందా?

Central Government Control Over Telugu State Projects

Central government control over Telugu state projects : ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న నీటి పంచాయతీని కేంద్రం తనకు అనుకూలంగా మార్చుకుంటోందా..? తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నియంత్రణ, నిర్వహణను తన గుప్పిట్లో పెట్టుకోనుందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ పరిధిని కేంద్రం ఖరారు చేసింది. కేంద్ర జల్‌శక్తి రూపొందించిన నివేకకు అమిత్ షా ఓకే చెప్పేశారు. దీంతో… నోటీఫై చేస్తూ ఉత్తర్వులు ఇచ్చేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ రెడీ అవుతోంది. ఇదే జరిగితే… బోర్డ్ పరధిలోకి శ్రీశైలం, నాగార్జునసాగర్‌ సహా భారీ, మధ్య, చిన్న ప్రాజెక్టులు వెళ్లిపోతాయి. జల విద్యుదుత్పత్తి కేంద్రాలు, ఎత్తిపోతలు, ఇన్‌లెట్లనూ బోర్డే నిర్వహిస్తుంది. బోర్డు పర్యవేక్షణలోనే ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం, సాగర్‌ అధికారుల విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

కృష్ణా పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్‌ మ్యాన్యువల్‌ను నోటిఫై చేయకపోవడం వల్లే ఇప్పుడున్న బోర్డుకు ఎలాంటి అధికారాలు లేకుండా పోయాయన్నది కేంద్రం చెప్పే మాట. దానివల్లే… తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం జల వివాదాలు తలెత్తుతున్నాయని చెబుతోంది. అసలు తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం ఎందుకు. కృష్ణ బోర్డ్ పరిధిలో ఎక్కువగా తెలంగాణలోని ప్రాజెక్టులున్నాయి. ఇప్పుడు ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వెళ్తే.. రాష్ట్రాల అధికారాలకు కత్తెర పడుతుంది.

తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నీటి వాటాల విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్వహణ, ఎత్తు పెంపు, కెనాళ్ల నిర్మాణం ఇలా ప్రతీ విషయంలోనూ గొడ జరగడం కామన్‌గా మారింది. కృష్ణా బోర్డుకు ఏపీ తెలంగాణలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే… ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నివేదికలు, చర్చల ద్వారా… జల జగడానికి చెక్ పెట్టేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. బోర్డ్ పరిధిని నోటిఫై చేస్తే.. అటు నీటి పంచాయతీ తీరడమే కాకుండా.. రెండు రాష్ట్రాల దూకుడుకు అడ్డుకట్ట వేయొచ్చని కేంద్రం భావిస్తోంది. మరో 15 రోజుల్లోనే బోర్డ్ పరిధి ఖరారు కావడం.. దానికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అయితే..ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

కృష్ణా బోర్డే సుప్రీం అనే నిర్ణయం వెలువడితే.. ప్రస్తుతం రాష్ట్రం చేతిలో ఉన్న అధికారాలు కేంద్రం చేతికి వెళ్తాయి. బోర్డు ఎలా చెబితే అంత నీటి వాటా రాష్ట్రాలకు దక్కుతుంది. ఇప్పటికే నీటి వాటాల విషయంలో అన్యాయం జరిగిందని తెలంగాణ వాదిస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణాలు అలాగే ఉన్నాయి. వీటన్నింటినీ చూడకుండా కృష్ణా బోర్డే సుప్రీం అనే నిర్ణయం తీసుకుంటే.. ఇప్పటిలాగే తీవ్ర నష్టం కలుగుతుందని తెలంగాణ వాదిస్తోంది. గతంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా సీఎం కేసీఆర్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మరి కేంద్రం తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకుంటుందా.. లేక ఎడారైనా సరే.. మేమే పెత్తనం చేస్తామంటూ కృష్ణా బోర్డ్ పరిధిని పెంచి నోటిఫై చేస్తుందా చూడాలి.