Heavy Rains In Andhra Pradesh: ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలకు అవకాశం.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

వాయువ్వ బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం ఏర్పడిన అల్పపీడన మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా రాబోయే రెండు రోజులు ఏపీలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

Heavy Rains In Andhra Pradesh: ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలకు అవకాశం.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

Heavy rains in Andhra Pradesh

Heavy Rains In Andhra Pradesh: వాయువ్వ బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం ఏర్పడిన అల్పపీడన మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. ఈ కారణంగా మరో 48 గంటల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిశా తీరాల మధ్య తీరం దాటే అవకాశం

Rains In Andhra Pradesh : రాగల 48 గంటల్లో ఏపీలో పలు చోట్ల వర్షాలు..ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు

వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు తీరం వెంబడి 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం కారణంగా సోమ, మంగళవారాల్లో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి. ఈ రెండు రోజులు ఉత్తర కోస్తాంధ్రలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Telugu States Heavy Rains : తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న వాయుగుండం..మూడు రోజులపాటు భారీ వర్షాలు

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖఅధికారులు తెలిపారు. ఇదిలాఉంటే ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 8.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.