Thunderstorms : ఏపీలోని ఆ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం అధికం

ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని తెలిపింది.

Thunderstorms : ఏపీలోని ఆ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం అధికం

Thunderstorms

Chance of thunderstorms : ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తారు నంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కోనసీమ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం అధికంగా ఉందని వెల్లడించింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని తెలిపింది. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా.బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు.

గన్నవరం విమానాశ్రయం నుండి బెంగుళూరు వెళ్ళవలసిన ఇండిగో విమానం ఆలస్యంగా వెళ్తుంది. వాతావరణం అనుకూలించకపోవటంతో విమానం పార్కింగ్ వద్దే ఉంది. విమానంలో ఉన్న 58 మంది ప్రయాణికులు అయోమయంలో ఉన్నారు. చీరాల, ఒంగోలులో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. విజయనగరం జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Andhra Pradesh Heavy Rains : మండుటెండల నుంచి బిగ్ రిలీఫ్.. ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు

కర్నూలు జిల్లా ఆలూరులో భారీ వర్షం కురిసింది. కల్లివంక వాగు పొంగిపొర్లుతోంది. వాగు వరద ఉద్ధృతికి కారు కొట్టుకుపోయింది. కారులో ఐదుగురు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కారు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గుంతకల్లు నుండి ఆలూరు వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారు ఆచూకీ కోసం గాలించారు. గల్లంతు అయిన కారు ఆచూకీ లభ్యం అయింది. హత్తిబేళగల్లు బ్రిడ్జీ దగ్గర కారును గుర్తించారు. కర్ణాటకకు చెందిన కారుగా ఉన్నట్లు సమాచారం. ఒకరి మృతదేహం లభ్యమైంది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.