అమరావతిని కదిలించే శక్తి ఎవరికైనా ఉందా? బాబు సవాల్

  • Published By: madhu ,Published On : January 9, 2020 / 01:28 PM IST
అమరావతిని కదిలించే శక్తి ఎవరికైనా ఉందా? బాబు సవాల్

అమరావతిని కదిలించే శక్తి ఎవరికైనా ఉందా ? ఇది ప్రజా రాజధాని..జగన్ రాజధాని కాదు…అడ్డొస్తే ఎవరినైనా వదిలిపెడుదామా అని ప్రశ్నించారు టీడీపీ చీఫ్ బాబు. 2020, జనవరి 09వ తేదీ గురువారం మచిలీపట్నంలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నిర్వహించిన సభలో బాబు మాట్లాడుతూ…రాజధాని విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ..విరాళాలు సేకరించడం జరిగిందని, రూ. 3 లక్షలు, ఒక రింగ్ వచ్చిందని..ఈ డబ్బును రాజధాని పరిరక్షణ సమితికి ఇవ్వడం జరుగుతోందన్నారు.

తన జీవితంలో అమరావతిని కట్టి..హైదరాబాద్ ధీటుగా అమరావతిని ఇవ్వాలని కలలు కని..శ్రీకారం చుట్టామన్నారు. కానీ బంగారు బాతును చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసం అన్ని పార్టీలు, సంఘాలు ఏకమయ్యాయన్నారు. ఏడు నెలల కాలంలో ఏమి చేశారు ? తాను నిర్మించిన భవనంలో కూర్చొన్నారని విమర్శించారు. లక్ష 10 వేల కోట్ల డబ్బులు ఖర్చవుతాయని మాయమాటలు చెబుతున్నారని, వీలుకాకపోతే తమకు అప్పగించాలని..2050 నాటికి ఈ డబ్బు అవసరం ఉంటుందన్నారు.

ఏ రాజధాని అడిగితే..మూడు రాజధానులు అని చెప్పడానికి సిగ్గు ఉండదా అని నిలదీశారు. తన మీద ఉన్న కోపాన్ని రాజధానిపై చూపించవద్దన్నారు. రాజధాని విషయంలో ప్రభుత్వం తీసుకుంటన్న చర్యలతో పది మంది రైతులు చనిపోయారని తెలిపారు. రాజధాని కావాలని విశాఖ వాసులు అడిగారా అని నిలదీశారు బాబు. నీతి, నిజాయితీ ఉండే ప్రాంతమని, విశాఖ వాసులకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేశానని చెప్పుకొచ్చారు. రూ. 70 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే..ఇప్పుడు వాటిని పంపించారని రాజధాని ప్రాంత వాసులకు వివరించారు. 

Read More : మచిలీపట్నంలో జోలె పట్టిన బాబు